Breaking News

రీఛార్జ్‌ ముగిస్తే ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ఎందుకు ఆపేస్తారు?

Published on Wed, 03/11/2026 - 11:44

రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ రాఘవ్ చద్దా ఇటీవల లేవనెత్తిన అంశాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్న పన్నులు, విమానాశ్రయాల్లో ఆహార ధరలు, ప్రజాప్రతినిధుల జవాబుదారీతనంపై ఆయన సంధించిన ప్రశ్నలు ఆలోచింపజేశాయి. ఈ నేపథ్యంలో ఆయన అడిగిన ప్రశ్నలు, వాటికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు ఎలా ఉన్నాయో కింద తెలియజేస్తున్నాం.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్రాన్ని సూటిగా ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచారు. ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌గా తనకున్న ఆర్థిక అవగాహనతో బడ్జెట్ లోపాలను ఎత్తిచూపడమే కాకుండా, రోజువారీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారికంగా కేంద్రం నుంచి సమాధానాలు రాబట్టారు.

పన్నుల భారంతో మధ్యతరగతి విలవిల

బడ్జెట్ 2026-27పై జరిగిన చర్చలో రాఘవ్ చద్దా కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు జరుగుతున్నా, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం ఎందుకు లేదు? జీతాలు పెరగకపోయినా ద్రవ్యోల్బణం (సుమారు 6.8%) కారణంగా కొనుగోలు శక్తి పడిపోతోంది. కనీసం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్‌టీసీజీ) పన్నును ఎత్తివేయాలి’ అని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ స్పందన: ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. దేశ మౌలిక సదుపాయాల కల్పన (క్యాపెక్స్‌) కోసం నిధుల సేకరణ అవసరమని, పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజా సంక్షేమ పథకాలకు మళ్లిస్తున్నామని పేర్కొంది. అయితే నేరుగా ఆదాయపు పన్ను తగ్గింపుపై స్పష్టమైన హామీ ఇవ్వలేదు.

రైట్ టు రీకాల్.. ఓటర్లకే ఆ అధికారం ఇవ్వాలి!

ఇటీవల రాఘవ్‌ చద్దా రాజ్యసభలో లేవనెత్తిన ‘రైట్ టు రీకాల్’ (ఎన్నికైన ప్రతినిధులు పనితీరు నచ్చకపోతే అధికారం తొలగించే హక్కు) అంశం సభ్యుల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. ‘ఎన్నికైన ప్రతినిధుల ఐదేళ్ల కాలపరిమితి ముగిసే వరకు వేచి చూడకుండా, పనితీరు సరిగ్గా లేని అభ్యర్థులను ఓటర్లే తొలగించేలా చట్టం తీసుకురావాలి’ అని చద్దా కోరారు. ప్రపంచవ్యాప్తంగా 24 దేశాల్లో ఈ విధానం ఉందని గుర్తుచేశారు.

ప్రభుత్వ స్పందన: ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం ఆచితూచి స్పందించింది. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ విధివిధానాల ప్రకారం దేశంలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అమలులో ఉందని తెలిపింది. ఇటువంటి మార్పులు రాజకీయ అస్థిరతకు దారితీసే అవకాశం ఉందని ప్రాథమికంగా అభిప్రాయపడింది.

విమానాశ్రయాల్లో ఆహార ధరలు..

విమానాశ్రయాల్లో కనీస ఆహార ధరలు ఆకాశాన్నంటుతున్నాయని సభలో తెలిపారు. సాధారణంగా లీటర్‌ వాటర్‌ బాటిల్‌ రూ.20 ఉంటే..  ఎయిర్‌పోర్ట్‌ల్లో మాత్రం ఇది సుమారు రూ.100గా ఉంటుంది. ఇదే కాకుండా వివిధ ఆహార పదార్థాల ధరలు ఎయిర్‌పోర్ట్‌ల్లో అధిక ధరలుంటాయి. ఈ నేపథ్యంలో ‘విమానాశ్రయాల్లో సామాన్య ప్రయాణికులకు తక్కువ ధరలో స్నాక్స్, పానీయాలు లభించే ఉడాన్ యాత్రి కేఫ్‌ల సంఖ్యను పెంచాలి. వాటిని సెక్యూరిటీ చెక్ దాటిన తర్వాత కూడా అందుబాటులో ఉంచాలి’ అని కోరారు.

ప్రభుత్వ స్పందన: పౌర విమానయాన శాఖ ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని, ప్రయాణికుల సౌకర్యార్థం విమానాశ్రయాల్లో సరసమైన ధరలకు ఆహారం అందించే అవుట్‌లెట్లను పెంచే దిశగా చర్యలు చేపడతామని తెలిపింది.

సిమ్ కార్డులు - ఇన్‌కమింగ్ కాల్స్‌..

రాఘవ్ చద్దా రాజ్యసభలో టెలికాం కంపెనీల దోపిడీని ఎండగట్టారు. ‘ప్రస్తుతం దేశంలోని టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్ గడువు ముగిసిన వెంటనే అవుట్‌గోయింగ్ మాత్రమే కాకుండా, ఇన్‌కమింగ్ కాల్స్ కూడా నిలిపివేస్తున్నాయి. దీనివల్ల సామాన్యులు, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, వలస కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారి వద్ద రీఛార్జ్ చేసుకునే డబ్బు లేకపోయినా తమకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా అందుకోలేకపోతున్నారు. ఇది ఒక రకమైన దోపిడీ కాదా?’ అని ప్రశ్నించారు.

బ్యాంకింగ్, రేషన్, ప్రభుత్వ పథకాలు.. ఓటీపీ ద్వారా ఫోన్ నంబర్‌కే లింక్ అయి ఉన్న తరుణంలో ఇన్‌కమింగ్ ఆపేయడం వల్ల సామాన్యులు ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం, ట్రాయ్ స్పందన: డేటా (ఇంటర్నెట్) అవసరం లేని వినియోగదారుల కోసం కేవలం వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌ మాత్రమే ఉండే చౌకైన ప్లాన్లను తీసుకురావాలని కంపెనీలను ఆదేశించింది. గతంలో ఉన్న 90 రోజుల పరిమితిని సడలించి వినియోగదారులు ఏకకాలంలో 365 రోజుల (ఒక ఏడాది) వరకు వాలిడిటీని పొందేలా స్పెషల్ టారిఫ్ వోచర్స్ తీసుకురావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

రాఘవ్ చద్దా లేవనెత్తిన ప్రశ్నలు కేవలం రాజకీయ కోణం నుంచి కాకుండా సామాన్యుడి ఆర్థిక, సామాజిక ప్రయోజనాల చుట్టూ ఉండడం విశేషం. ముఖ్యంగా పన్నుల సంస్కరణలు, వర్కర్ల రక్షణపై ఆయన అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం రాతపూర్వక సమాధానాలు భవిష్యత్తు విధాన నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: కొనుగోలుదారులను ఆడేసుకుంటున్న బంగారం..

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)