Breaking News

రూ.3,900 కోట్లు సమీకరించిన జెప్టో 

Published on Fri, 10/17/2025 - 00:28

న్యూఢిల్లీ: క్విక్‌కామర్స్‌ సంస్థ జెప్టో తాజాగా 450 మిలియన్‌ డాలర్ల (రూ.3,900 కోట్లుl. సుమారు) నిధులను సమీకరించింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ 7 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఏడాది క్రితం 350 మిలియన్‌ డాలర్ల నిధుల సమీకరణ నాటికి కంపెనీ మార్కెట్‌ విలువ 5 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. అక్కడి నుంచి చూస్తే 40 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. 

తాజా నిధుల సమీకరణంలో అధిక భాగం కొత్త ఈక్విటీ షేర్ల జారీ రూపంలోనే ఉంది. అలాగే తొలినాళ్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లలో కొందరు స్వల్ప వాటాలను విక్రయించారు. ఈ విడతలో కాల్‌పర్స్‌ నుంచి ఎక్కువగా పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుతం కంపెనీ ఖాతాల్లో 900 మిలియన్‌ డాలర్ల మేర నికర నగదు నిల్వలు ఉన్నాయని, భవిష్యత్తు అవసరాలకు పూర్తిగా సరిపోతాయని కంపెనీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు ఆదిత్‌ పలీచా తెలిపారు.

త్వరలో పబ్లిక్‌ ఇష్యూ చేపట్టాలనుకుంటున్న జెప్టోలో ప్రస్తుతం దేశీ ఇన్వెస్టర్ల వాటా 12 శాతంగా ఉండగా, కొన్ని వారాల్లోనే ఇది 40 శాతానికి చేరుకుంటుందని చెప్పారు. క్విక్‌కామర్స్‌ విభాగంలో బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్‌లకు గట్టిపోటీనిస్తున్న జెప్టో పట్ల ప్రైవేటు ఇన్వెస్టర్లలో బలమైన విశ్వాసం కనిపిస్తోంది. రోజువారీ 17 లక్షల ఆర్డర్లను స్వీకరిస్తున్నట్టు.. మెజారిటీ డార్క్‌స్టోర్లు లాభాల్లోకి వస్తున్నట్టు పలీచా తెలిపారు. గతేడాది నిధుల సమీకరణ నాటితో పోల్చితే ఈ విడత మెజారిటీ స్టోర్లు లాభాల్లోకి వచ్చినట్టు చెప్పారు.  

విస్తరణపై వ్యయం 
తాజాగా సమకూరిన పెట్టుబడులతో బ్యాలన్స్‌ షీట్‌ను మెరుగ్గా నిర్వహించగలమని, మోస్తరు విస్తరణకు వ్యయం చేయొచ్చని పలీచా చెప్పారు. ఒకవైపు కార్యకలాపాలను విస్తరిస్తూనే, లాభాల్లోకి రావడంపై దృష్టి సారించినట్టు పేర్కొన్నారు.  

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)