Breaking News

ఇండియన్ రైల్వే కంటే ఎక్కువ ఉద్యోగాలు!.. జెప్టో ఫౌండర్

Published on Fri, 11/22/2024 - 16:11

క్విక్ కామర్స్ బిజినెస్.. దేశంలోని సుమారు 2 లక్షల కిరాణా షాపులు మూతపడటానికి కారణమవుతాయని 'రిటైల్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్' (AICPDF) వెల్లడించింది. అయితే క్విక్ కామర్స్ అనేది కిరానా స్టోర్‌లకు ఎలాంటి నష్టాన్ని కలిగించదని జెప్టో కో ఫౌండర్ 'ఆదిత్ పాలిచా' (Aadit Palicha) పేర్కొన్నారు.

జెప్టో, బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ వంటి క్విక్ కామర్స్ కంపెనీల బిజినెస్ అభివృద్ధి చెందటం వల్ల కిరానా స్టోర్‌లు ప్రభావితమవుతుందనేది సరైంది కాదని పాలిచా అన్నారు. 2022-23 & 2023-24 ఆర్థిక సంవత్సరాల మధ్య కిరాణా, గృహావసరాల వినియోగం 46 బిలియన్ డాలర్లు అని 'కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్' (CAIT) డేటా వెల్లడించింది. ఇందులో క్విక్ కామర్స్ వాటా 5 బిలియన్ల కంటే తక్కువ, అంటే మిగిలిన 41 బిలియన్స్ కిరానా స్టోర్‌లకు వెళ్లాయని ఆయన అన్నారు.

వచ్చే ఐదేళ్లలో క్విక్ కామర్స్ బిజినెస్ 1500 శాతం పెరగనున్నట్లు పలు నివేదికలు అంచనా వేస్తున్నాయి. అధిక ధరలకు సంబంధించిన ఆరోపణల గురించి అడిగినప్పుడు.. తయారీదారు ధర కంటే తక్కువ ధరలకే మేము అందిస్తున్నామని ఆదిత్ పాలిచా పేర్కొన్నారు.

క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో పండ్లు, కూరగాయల ధరలు 20 నుంచి 30 శాతం అధికంగా ఉండటానికి కారణం ఏంటని అడిగినప్పుడు.. పాలిచా మాట్లాడుతూ.. నాణ్యత కారణంగా 100 శాతం కార్బైడ్ లేని.. రిఫ్రిజిరేటెడ్‌లో నిల్వ చేసిన జెప్టోలోని మామిడి పండును ఉదాహరణగా చెప్పారు. ఉద్యోగాల సృష్టి కూడా ఈ విభాగంలో భారీగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: జీతం లేని జాబ్.. స్పందించిన మాజీ ఉద్యోగి: ట్వీట్ వైరల్

రాబోయే 2 - 3 సంవత్సరాలలో ప్రభుత్వానికి 300 - 400 మిలియన్లు ప్రత్యక్ష పన్నుల రూపంలో చేరతాయని పాలిచా అన్నారు. ఇది దేశ ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. జెప్టో 3 నుంచి 4 లక్షల మంది డెలివరీ భాగస్వామ్యులను కలిగి ఉంది.

ఇంతకు ముందు ప్రతి వ్యక్తి జెప్టోలో నెలకు రూ. 10,000 నుంచి రూ. 15,000 సంపాదించేవారు. ప్రస్తుతం గ్రౌండ్ ఫోర్స్‌కు నెలకు రూ. 23వేలు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. క్విక్ కామర్స్ బిజినెస్ రాబోయే 2 - 3 సంవత్సరాల్లో భారతీయ రైల్వే కంటే కూడా ఎక్కువ ఉద్యోగాలను సృష్టిస్తుందని ఆయన అన్నారు.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)