Breaking News

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ జోరు

Published on Wed, 08/14/2024 - 08:43

దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌ గణనీయంగా విస్తరిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 3.2 శాతం వృద్ధి చెందింది. ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ (ఐడీసీ) నివేదిక ప్రకారం 3.9 కోట్ల స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్‌ (రిటైలర్లకు తయారీ సంస్థలు సరఫరా చేసే ఫోన్ల సంఖ్య) నమోదైంది. ఇందులో 16.5 శాతం మార్కెట్‌ వాటాతో చైనా కంపెనీ వివో అగ్రస్థానంలో ఉండగా, 13.5 శాతం వాటాతో అదే దేశానికి చెందిన షావోమి రెండో స్థానంలో నిలిచింది. కొరియన్‌ సంస్థ శాంసంగ్‌ అమ్మకాలు 15.4 శాతం క్షీణించడంతో 12.9 శాతం మార్కెట్‌ వాటాతో మూడో స్థానానికి పరిమితమైంది. మరోవైపు, మార్కెట్‌ వాటాపరంగా యాపిల్‌ 6.7 శాతం వాటాతో ఆరో స్థానంలో ఉన్నప్పటికీ సూపర్‌ ప్రీమియం సెగ్మెంట్‌లో (రూ.67,000 పైగా రేటు ఉండే ఫోన్లు) మాత్రం 83 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది.

నివేదికలోని మరిన్ని విశేషాలు..

  • ఫ్లాగ్‌షిప్‌ ఎక్స్‌ ఫోల్డ్‌ 3 ప్రోతో పాటు వై సిరీస్, మిడ్‌–ప్రీమియం వి సిరీస్‌ల్లో వివిధ ధరల శ్రేణిలో ఫోన్లను ఆవిష్కరించిన వివో వరుసగా రెండో త్రైమాసికంలోనూ అగ్రస్థానంలో నిలిచింది.

  • ఎంట్రీ ప్రీమియం సెగ్మెంట్‌ (రూ.16,000 నుంచి రూ.33,500 వరకు ధర ఉండేవి) వాటా 22 శాతం నుంచి 30 శాతానికి పెరిగింది. ఈ సెగ్మెంట్‌ మెరుగైన వృద్ధి కనపర్చగలదని అంచనాలు ఉన్నాయి. చౌక 5జీ స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరిస్తున్నప్పటికీ 100 డాలర్ల లోపు (సుమారు రూ.8,400) ధర ఉండే ఎంట్రీ లెవెల్‌ ఫోన్ల అమ్మకాలకు ఈ ఏడాది సవాళ్లు ఎదురుకావచ్చు. జెన్‌ఏఐ స్మార్ట్‌ఫోన్లకు ప్రచారం మరింత పెరగవచ్చు.

  • క్యూ2లో 2.7 కోట్ల 5జీ స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్‌ నమోదైంది. 5జీ స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్‌ వార్షికంగా 49 శాతం నుంచి 77 శాతానికి పెరిగింది. ఇందులోనూ రూ.8,000 నుంచి రూ.16,700 వరకు ధర ఉండే మాస్‌ బడ్జెట్‌ సెగ్మెంట్‌ ఫోన్ల షిప్‌మెంట్‌ 2.5 రెట్లు పెరిగింది. 

ఇదీ చదవండి: కోరికలు తీర్చే ‘ఫిష్‌’!

  • ప్రీమియం సెగ్మెంట్‌లో (రూ.50,000 నుంచి రూ.67,000 వరకు ధర శ్రేణి) యాపిల్‌ మార్కెట్‌ వాటా 61 శాతానికి, శాంసంగ్‌ వాటా 24 శాతానికి పెరిగింది.  

  • ఈ ఏడాది ప్రథమార్ధంలో దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల షిప్‌మెంట్లు 6.9 కోట్లుగా నమోదయ్యాయి.

#

Tags : 1

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)