చిన్న పొదుపులకు పెద్ద ఊరట

Published on Sat, 04/01/2023 - 13:39

న్యూఢిల్లీ: ఎకానమీలో వడ్డీరేట్ల పెరుగుదల పరిణామాలు చిన్న పొదుపుదారులకు మేలు చేకూర్చుతున్నాయి.  2023 ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి సంబంధించి పలు పోస్టాఫీసు పొదుపు పథకాలపై వడ్డీరేట్లను 0.1 శాతం నుంచి  0.7 శాతం వరకూ పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది.  మే నెల నుంచి ఆర్‌బీఐ రెపో రేటును వరుసగా ఆరుసార్లు 2.5 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది.

ఇది బ్యాంకులు అటు రుణ రేట్లు-ఇటు డిపాజిట్‌ రేట్ల పెరుగుదలకు దారితీస్తోంది.  రానున్న త్రైమాసికానికి సంబంధించి పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌), సేవింగ్స్‌ డిపాజిట్ల వడ్డీరేట్లు వరుసగా 7.1శాతం,  4 శాతాలుగా కొనసాగించినప్పటికీ, ఇతర సేవింగ్స్‌ పథకాలపై రేట్లు 0.1శాతం నుంచి 0.7శాతం  మధ్య పెరిగాయి. నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌పై (ఎన్‌ఎస్‌సీ)పై అత్యధికంగా వడ్డీరేటు పెరిగింది. 

పథకాల వారీగా రేట్ల పెరుగుదల (శాతాల్లో)  
పథకం    కొత్త వడ్డీ       పాత వడ్డీ 
ఎన్‌ఎస్‌సీ    7.7    7 
సుకన్యా సమృద్ధి     8    7.6 
సీనియర్‌ సిటిజన్‌ 
సేవింగ్స్‌ స్కీమ్‌    8.2    8 
కిసాన్‌ వికాస్‌ పత్ర    7.5    7.2 
ఏడాది టర్మ్‌ డిపాజిట్‌    6.8    6.6 
రెండేళ్ల టర్మ్‌ డిపాజిట్‌    6.9    6.8 
మూడేళ్ల టర్మ్‌ డిపాజిట్‌    7    6.9 
ఐదేళ్ల టర్మ్‌ డిపాజిట్‌     7.5    7  
నెలవారీ ఆదాయ పథకం    7.4    7.1 
 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)