ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
IND vs ZIM: అదరగొట్టిన భారత బౌలర్లు.. జింబాబ్వే స్కోరెంతంటే?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
అన్వయ్ ద్రవిడ్ విధ్వంసకర శతకం
జింబాబ్వేతో టీ20.. భారత్ బౌలింగ్.. యువ ప్లేయర్ అరంగేట్రం
IND vs WI: ఐదో టీ20.. అభిమానులకు బ్యాడ్‌న్యూస్!
కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు: వీడియో వైరల్
మీరట్ బ్లూడ్రమ్ కేసు తరువాత మరో సంచలనం : భార్య, ప్రియుడికి ఉరి శిక్ష
కూటమిలో ‘స్థానిక’ కుంపట్లు.. అయ్యన్న పాత్రుడికి షాక్
AP: తీవ్ర విషాదం: ఈతకెళ్లి ఐదుగురి దుర్మరణం
వెస్టిండీస్‌తో ఐదో టీ20... భువీకి చోటు: బీసీసీఐ ప్రకటన
వన్డేలో సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం.. డబుల్ సెంచరీ మిస్!
బంగారంలో కొత్త పెట్టుబడుల నిలిపివేత
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్: రూ.699కే నెలంతా థియేటర్లో సినిమాలు!
Published on Sat, 10/14/2023 - 20:22
సినీ ప్రేక్షకుల కోసం ప్రముఖ సినిమా చైన్ పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్ 'PVR INOX పాస్‌పోర్ట్' అనే కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ప్రేక్షకులను తరచూ థియేటర్లకు లక్ష్యంతో తీసుకొచ్చిన మొదటి సినిమా సబ్స్క్రిప్షన్ పాస్ ఇది.
ఈ నెలవారీ సబ్స్క్రిప్షన్ పాస్‌లు అక్టోబర్ 16 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ పాస్ ద్వారా కేవలం రూ.699తో నెలకు 10 సినిమాల వరకు చూడవచ్చు. అయితే వీటికి కొన్ని షరతులు ఉన్నాయి. పీవీఆర్ ఐనాక్స్ వెబ్సైట్లో పేర్కొన్న ప్రకారం అవి ఏంటంటే..
- ఈ ఆఫర్ సోమవారం నుంచి గురువారం వరకు వర్తిస్తుంది.
- ఐమ్యాక్స్, గోల్డ్, లక్, డైరెక్టర్స్ కట్ వంటి ప్రీమియం థియేటర్లకు ఇది వర్తించదు.
- సినిమా చైన్ యాప్ లేదా వెబ్సైట్ నుంచి కనీసం మూడు నెలల సబ్స్క్రిప్షన్ వ్యవధికి 'PVR INOX పాస్‌పోర్ట్' కొనుగోలు చేయవచ్చు.
- రిడీమ్ చేసుకోవడానికి వినియోగదారులు లావాదేవీ చెక్ అవుట్ సమయంలో చెల్లింపు ఎంపికగా పాస్‌పోర్ట్ కూపన్‌ను ఎంచుకోవలసి ఉంటుంది.
- ఒకటి కంటే ఎక్కువ టికెట్లు కొంటున్నట్లయితే, ఒక టికెట్‌కు పాస్‌పోర్ట్ కూపన్‌ని ఉపయోగించవచ్చు.
- ఈ పాస్‌పోర్ట్ అనేది బదిలీ చేయలేని సబ్స్క్రిప్షన్. ఒకరే వినియోగించాల్సి ఉంటుంది.
- థియేటర్లోకి వెళ్లే ముందు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది.
ఇక ఆహారం, పానీయాల విషయంలోనూ పీవీఆర్ ఐనాక్స్ ఇదివరకే వాటి ధరలను 40 శాతం తగ్గించింది. సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య రూ. 99 నుంచి ప్రారంభమయ్యే ఫుడ్ కాంబోలను పరిచయం చేసింది.
#
Tags : 1