Breaking News

కొత్త లగ్జరీ కారు కొన్న పుష్ప నటుడు - ధర ఎంతైనా తగ్గేదేలే!

Published on Fri, 08/25/2023 - 17:54

ప్రముఖ మలయాళ నటుడు 'ఫహద్ ఫాసిల్' పేరు తెలియకపోయినా.. 'పార్టీ లేదా పుష్పా' అనే డైలాగ్ వింటే మాత్రం వెంటనే ఆయనెవరో గుర్తొచ్చేస్తుంది. అంతగా పాపులర్ అయిన నటుడు ఇటీవల ఒక ఖరీదైన కారుని కొనుగోలు చేసాడు. దీని ధర ఎంత? ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఫహద్ ఫాసిల్ కొనుగోలు చేసిన కారు 'ల్యాండ్ రోవర్' (Land Rover) కంపెనీకి చెందిన 'డిఫెండర్' అని తెలుస్తోంది. ఇటీవల వారి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా ఈ కారు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని ధర రూ. 2.11 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇప్పటికే ఈ కారు అర్జున్ కపూర్, ప్రకాష్‌రాజ్, ఆయుష్ శర్మ, సన్నీ డియోల్, సునీల్ శెట్టి వంటి చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో ఉంది.

గోండ్వానా స్టోన్ పెయింట్ స్కీమ్ కలిగిన ఈ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది భారతీయ మార్కెట్లో డిఫెండర్ 130, డిఫెండర్ 110 & డిఫెండర్ 90 అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఫహద్ ఫాసిల్ డిఫెండర్ 90 కొనుగోలు చేసినట్లు చిత్రాల ద్వారా తెలుస్తుంది. ఇది కూడా మూడు డోర్లు కలిగిన వేరియంట్.

ఇదీ చదవండి: రూ. 76000 మ్యాక్‌బుక్‌ ఆర్డర్ చేస్తే.. వచ్చింది ఇదా? ఖంగుతిన్న కస్టమర్!

ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90 వేరియంట్ 5.0 లీటర్ వి8 ఇంజన్‌ కలిగి 296 హార్స్ పవర్ & 650 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పనితీరు పరంగా అద్భుతమైన ఈ కారు వాహన వినియోగదారులకు ఉపయోగపడే దాదాపు అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇప్పటికే ఫహద్ ఫాసిల్ లంబోర్ఘిని ఉరస్, మినీ కంట్రీమ్యాన్, పోర్షే 911 కారెరా ఎస్ స్పోర్ట్స్‌ వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)