Breaking News

జొమాటో యూనిఫామ్‌లో మార్పులు.. క్షణాల్లోనే నిర్ణయం వెనక్కి..

Published on Wed, 03/20/2024 - 12:11

ప్రత్యేకంగా శాకాహారమే కోరుకునే వినియోగదారుల కోసం ‘ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌’ పేరుతో ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో కొత్త సేవలు ప్రారంభించింది. శాకాహారుల కోరిక మేరకే ఈ సేవలు ప్రారంభించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్‌ గోయల్‌ తెలిపారు. అయితే ఈ ప్రకటన చేసిన సమయంలో డెలివరీ స్టాఫ్‌కు ప్రత్యేకంగా గ్రీన్‌కలర్‌ డ్రెస్‌కోడ్‌ ఉంటుందని ప్రకటించారు. అలా ప్రకటన వెలువరించిన కాసేపటికే కంపెనీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇకపై అందరూ ఎర్ర రంగు యూనిఫామ్‌ను ధరిస్తారని చెప్పింది. అయితే ‘ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌’ సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. వెజ్‌ ఆర్డర్లను అందించడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారని కంపెనీ వివరించింది. 

సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో వ్యతిరేక సామాజిక పరిణామాలు ఎదురైతే మాత్రం ‘ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌’ను వెంటనే నిలిపివేస్తామని దీపిందర్ గోయల్ తెలిపారు. ఆకుపచ్చ యూనిఫామ్‌ ధరించడంపట్ల కొన్ని సమాజిక వర్గాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌ వెనుక ఎలాంటి రాజకీయ, మతపరమైన ఉద్దేశాలు లేవని గోయల్‌ స్పష్టం చేశారు.

‘చాలామంది వినియోగదారులు నిత్యం నాన్‌వెజ్‌ ఆర్డర్‌ చేస్తారు. డెలివరీ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ డెలివరీ బాక్సుల్లో పదార్థాలు కొన్నిసార్లు ఒలికిపోయే అవకాశం ఉంటుంది. దాంతో ఆ వాసన అలాగే ఉండిపోతుంది. తదుపరి ఆర్డర్‌ చేసే శాకాహార వినియోగదారులకు అది ఒకింత ఇబ్బంది కలిగించే అంశం. దాంతో ఫ్లీట్‌ను విభజించాం. కొంతమంది ప్యూర్‌ వెజిటేరియన్‌ హోటళ్ల నుంచి మాత్రమే ఫుడ్‌ ఆర్డర్‌ పెడతారు. వారిని దృష్టిలో ఉంచుకుని తాజా నిర్ణయం తీసుకున్నాం’ అని సీఈఓ వివరించారు. 

భారత్‌లోనే అత్యధిక శాతం శాకాహారులు ఉన్నారని గోయల్‌ తెలిపారు. ఆహారం వండే విధానం, దాన్ని నిర్వహించడంపై వారు ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉంటారని అన్నారు. కేవలం శాకాహారమే అందించే రెస్టారెంట్‌ల ఎంపిక, నాన్‌-వెజ్‌ ఆహారాన్ని మినహాయించడం వంటివి ఫ్యూర్‌ వెజ్‌ మోడ్‌లో ఉంటాయి.

ఇదీ చదవండి: ఉద్యోగుల జీతాల పెంపునకు టీసీఎస్‌ ఎస్‌?

ఫ్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌ ఆహారాన్ని డెలివరీ చేసేందుకు జొమాటో సాధారణంగా వినియోగించే ఎర్ర బాక్సుల స్థానంలో ఆకుపచ్చ డెలివరీ బాక్స్‌లను వినియోగించనుందని ముందుగా ప్రకటించింది. కొన్ని వర్గాల నుంచి సామాజిక మాధ్యమాల్లో విమర్శలు రావడంతో డెలివరీ బాక్స్‌లు, యూనిఫామ్‌ విషయంతో ప్రకటనను తిరిగి వెనక్కి తీసుకుంది. కానీ ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌ సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)