ఇళ్లను రద్దు చేస్తాడంటా.. ఎవడబ్బ సొమ్మ ఎవరు రద్దు చేస్తారు..
Breaking News
పీఎన్‌బీ లాభం అప్
Published on Wed, 05/06/2026 - 02:58
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 14% ఎగసి రూ. 5,225 కోట్లను తాకింది. వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. అంతక్రితం ఏడాది (2024–25) ఇదే కాలంలో రూ. 4,567 కోట్లు ఆర్జించింది.
వాటాదారులకు బ్యాంక్ బోర్డ్ షేరుకి రూ. 3 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం స్వల్ప వెనకడుగుతో రూ. 36,319 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం క్యూ4లో రూ. 36,705 కోట్ల ఆదాయం సాధించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.95% నుంచి 2.95 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.4 శాతం నుంచి 0.29 శాతానికి దిగివచ్చాయి.
ఫలితాల నేపథ్యంలో పీఎన్‌బీ షేరు బీఎస్‌ఈలో 0.8 శాతం నష్టంతో రూ. 108 వద్ద ముగిసింది.
Tags : 1