Breaking News

భారత్‌కు చెందిన మొదటి సోలార్‌ ఈవీ

Published on Tue, 01/21/2025 - 14:54

పుణెకు చెందిన వైవ్ మొబిలిటీ భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ వాహనం (ఈవీ) వైవే ఈవాను భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించింది. రూ.3.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన వైవే ఈవా సోలార్ టెక్నాలజీతో ఈవీ మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

వైవే ఈవా పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ అమర్చారు. ఇది రోజుకు 10 కిలోమీటర్ల పరిధిని పెంచుతుంది. ఈ ఫీచర్ సాంప్రదాయ ఛార్జింగ్ అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ వాహనం ప్రత్యేకమైన బ్యాటరీ రెంటల్ ప్లాన్‌ను అందిస్తుంది. ఇందుకోసం కిలోమీటరుకు రూ.2 సబ్ స్క్రిప్షన్ ఖర్చు అవుతుంది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. నోవా (9 కిలోవాట్ బ్యాటరీ), స్టెల్లా (12 కిలోవాట్ బ్యాటరీ), వెగా (18 కిలోవాట్ బ్యాటరీ) వేరియంట్లు ఉన్నాయి. ఎంచుకున్న బ్యాటరీ ప్యాక్‌ను బట్టి ధరలు రూ.3.25 లక్షల నుంచి రూ.5.99 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటాయి. వైవే ఈవా గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కేవలం 5 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది.

ఇదీ చదవండి: రూ.1,275 లక్షల కోట్లకు ప్రపంచ కుబేరుల సంపద

వైవే ఎవా డెలివరీలు 2026 ద్వితీయార్ధంలో ప్రారంభమవుతాయని వైవ్ మొబిలిటీ ప్రకటించింది. మొదటి 25,000 మంది కస్టమర్లకు పొడిగించిన బ్యాటరీ వారంటీ, మూడు సంవత్సరాల కాంప్లిమెంటరీ వెహికల్ కనెక్టివిటీతో సహా అదనపు ప్రయోజనాలను కూడా కంపెనీ అందిస్తున్నట్లు ప్రకటించింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)