ప్రభుత్వ బ్యాంకుల డివిడెండ్‌ అప్‌

Published on Tue, 03/25/2025 - 10:03

గత ఆర్థిక సంవత్సరం(2023–24) ప్రభుత్వ రంగ బ్యాంకుల డివిడెండ్‌ చెల్లింపులు 33 శాతం ఎగశాయి. ఉమ్మడిగా రూ.27,830 కోట్లు చెల్లించాయి. ఇది పీఎస్‌యూ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి భారీగా మెరుగుపడినట్లు తెలియజేస్తోంది. అంతక్రితం ఏడాది(2022–23) ప్రభుత్వ బ్యాంకులు డివిడెండ్‌ రూపేణా రూ.20,694 కోట్లు అందించాయి. వీటితో పోలిస్తే గతేడాది చెల్లింపులు 33 శాతం బలపడ్డాయి. కాగా.. వీటిలో 65 శాతం అంటే రూ.27,830 కోట్లు వాటా ప్రకారం ప్రభుత్వానికి అందించాయి.

ఇదేవిధంగా 2022–23లో ప్రభుత్వ వాటాకు పీఎస్‌యూ బ్యాంకులు ఉమ్మడిగా రూ.13,804 కోట్లు చెల్లించాయి. గతేడాది ఎస్‌బీఐసహా 12 ప్రభుత్వ బ్యాంకులు పీఎస్‌యూ బ్యాంకింగ్‌ చరిత్రలోనే అత్యధికంగా రూ.1.41 లక్షల కోట్లకుపైగా నికర లాభం ఆర్జించాయి. దీనిలో ఎస్‌బీఐ వాటా విడిగా 40 శాతంకావడం గమనార్హం! 2022–23లో రూ.1.05 లక్షల కోట్ల నికర లాభం ప్రకటించాయి. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి 9 నెలల్లో(ఏప్రిల్‌–డిసెంబర్‌) రూ.1.29 లక్షల కోట్ల నికర లాభం సాధించిన విషయం విదితమే.  

ఇదీ చదవండి: చైనా ఆర్మీలోకి ‘డీప్‌సీక్‌’!

ఎస్‌బీఐ 22 శాతం జూమ్‌

గతేడాది ఎస్‌బీఐ రూ. 61,077 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది సాధించిన రూ. 50,232 కోట్లతో పోలిస్తే 22 శాతం అధికం! పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నికర లాభం అత్యధికంగా 228 శాతం దూసుకెళ్లి రూ. 8,245 కోట్లను తాకింది. ఈ బాటలో యూనియన్‌ బ్యాంక్‌ లాభం 62 శాతం వృద్ధితో రూ. 13,249 కోట్లకు చేరగా.. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లాభం 61 శాతం ఎగసి రూ. 2,549 కోట్లయ్యింది. ఇతర సంస్థల లాభాలలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 57 శాతం వృద్ధితో రూ. 6,318 కోట్లకు, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర 56 శాతం ఎగసి రూ. 4,055 కోట్లకు, ఇండియన్‌ బ్యాంక్‌ 53 శాతం అధికంగా రూ. 2,549 కోట్లకు చేరాయి. 2017–18లో పీఎస్‌బీలు ఉమ్మడిగా రూ. 85,390 కోట్ల నష్టాలు నమోదుచేయగా.. 2023–24కల్లా ఏకంగా రూ. 1,41,203 కోట్ల నికర లాభం ఆర్జించి సరికొత్త రికార్డ్‌ సాధించడం కొసమెరుపు!!

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)