Breaking News

సవాళ్లలోనూ పీఎస్‌బీల బలమైన పనితీరు

Published on Sun, 11/17/2024 - 03:53

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్‌–సెప్టెంబర్) ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) బలమైన పనితీరు చూపించాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. పీఎస్‌బీల నికర లాభం 26 శాతం పెరగ్గా, వ్యాపారం 11 శాతం వృద్ధి చెందినట్టు తెలిపింది. ఎస్‌బీఐ, పీఎన్‌బీ, యూనియన్, కెనరా బ్యాంక్‌ సహా మొత్తం 12 ప్రభుత్వరంగ బ్యాంకుల గణాంకాలు ఇందులో ఉన్నాయి.

 ‘‘క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు రుణాలు 12.9 శాతం వృద్ధితో రూ.102.29 లక్షల కోట్లు, డిపాజిట్లు 9.5 శాతం వృద్ధితో రూ.133.75 లక్షల కోట్లకు చేరాయి. ఈ కాలంలో నిర్వహణ లాభం 14.4 శాతం పెరిగి రూ.1,50,023 కోట్లుగా, నికర లాభం 25.6 శాతం పెరిగి రూ.85,520 కోట్లుగా ఉన్నాయి. స్థూల ఎన్‌పీఏలు 3.12 శాతం (1.08 శాతం తక్కువ), నికర ఎన్‌పీఏలు 0.63 శాతానికి (0.34 శాతం తగ్గుదల) తగ్గాయి’’అని ఆర్థిక శాఖ వెల్లడించింది.  

ఫలితమిస్తున్న చర్యలు.. 
‘‘బ్యాంకింగ్‌లో చేపట్టిన సంస్కరణలు, నిరంతర పర్యవేక్షణ చాలా వరకు సవాళ్లను పరిష్కరించాయి. రుణాల విషయంలో మెరుగైన క్రమశిక్షణ అవసరమైన వ్యవస్థలు, విధానాలు ఏర్పడ్డాయి. నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏలు) గుర్తింపు, వాటికి పరిష్కారం, రుణాల మంజూరీలో బాధ్యాతాయుతంగా వ్యవహరించడం, టెక్నాలజీ అమలు తదితర చర్యలు ఫలించాయి. స్థిరమైన ఆర్థిక శ్రేయస్సుకు, బ్యాంకింగ్‌ రంగం పటిష్టానికి దోహపడ్డాయి.

ఇదే పీఎస్‌బీల పనితీరులో ప్రతిఫలించింది’’ అని ఆర్థిక శాఖ వివరించింది. ఏఐ/క్లౌడ్‌/బ్లాక్‌చైన్‌ తదితర టెక్నాలజీల విషయంలో పీఎస్‌బీలు గణనీయమైన పురోగతి చూపించడంతోపాటు, డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపరుచుకున్నట్టు వివరించింది. సైబర్‌ సెక్యూరిటీ రిస్‌్కలను తగ్గించేందుకు అవసరమైన వ్యవస్థలు/నియంత్రణలను అమల్లో పెట్టిన ట్టు తెలిపింది. అత్యుత్తమ కస్టమర్‌ అనుభూతికై చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)