Breaking News

ప్రాక్సిమస్‌ గ్రూప్‌ గూటికి రూట్‌ మొబైల్‌

Published on Tue, 07/18/2023 - 06:27

న్యూఢిల్లీ: ఎంటర్‌ప్రైజ్‌ మెసేజింగ్‌ సేవల సంస్థ రూట్‌ మొబైల్‌లో బెల్జియంకు చెందిన ప్రాక్సిమస్‌ గ్రూప్‌ 84 శాతం వరకు వాటాలను దక్కించుకోనుంది. ఇందులో భాగంగా ముందు దాదాపు 58 శాతం వాటాలను రూ. 5,922 కోట్లకు కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌తో నిబంధనల ప్రకారం.. 26 శాతం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించాల్సి రానుండటంతో, ఆ మేరకు షేర్లన్నింటినీ కొనుగోలు చేస్తే మొత్తం 84 శాతం వరకూ వాటాలను పెంచుకునే అవకాశం ఉంది.

అయితే, లిస్టెడ్‌ కంపెనీల్లో పబ్లిక్‌ వాటా కనీసం 25 శాతం ఉండాలనే నిబంధన మేరకు 12 నెలల్లోగా కొన్ని షేర్లను విక్రయించి తన వాటాను 75%కి తగ్గించుకోవాల్సి రానుంది. షేరు ఒక్కింటికి రూ. 1,626.40 చొప్పున అనుబంధ సంస్థ ప్రాక్సిమస్‌ ఓపల్‌ ద్వారా ప్రాక్సిమస్‌ గ్రూప్‌ తమ సంస్థలో 57.56% వాటాలను కొనుగోలు చేయనున్నట్లు రూట్‌ మొబైల్‌ తెలిపింది.  లావాదేవీ పూర్తయ్యాక రూట్‌ మొబైల్‌ సీఈవో రాజ్‌దీప్‌ గుప్తా తన ప్రస్తుత బాధ్యతల్లో కొనసాగుతూనే.. గ్రూప్‌ సీపాస్‌ (కమ్యూనికేషన్స్‌ ప్లాట్‌ఫాం యాజ్‌ ఎ సర్వీస్‌) కార్యకలాపాలకు సారథ్యం వహిస్తారు. రూట్‌ మొబైల్‌లో వాటాల కొనుగోలుతో అంతర్జాతీయంగా సీపాస్‌ విభాగంలో తమ స్థానం మరింత పటిష్టం కాగలదని ప్రాక్సిమస్‌ గ్రూప్‌ సీఈవో గిలామ్‌ బూటిన్‌ తెలిపారు.  

ప్రాక్సిమస్‌ సంస్థలో పెట్టుబడి..
ఒప్పందం ప్రకారం రూట్‌ మొబైల్‌ వ్యవస్థాపక వాటాదారుల్లో కొందరు ప్రాక్సిమస్‌ ఓపల్‌లో అలాగే ప్రాక్సిమస్‌కు చెందిన మరో అనుబంధ సంస్థ టెలీసైన్‌లో మైనారిటీ వాటాలు తీసుకోనున్నారు. ఇందుకోసం 299.6 మిలియన్‌ యూరోలను వెచి్చంచనున్నారు.  రూట్‌ మొబైల్‌ మరింత ముందుగానే బిలియన్‌ డాలర్ల ఆదాయ లక్ష్యాన్ని సాధించేందుకు టెలీసైన్‌తో భాగస్వామ్యం ఉపయోగపడగలదని గుప్తా ధీమా వ్యక్తం చేశారు.
సోమవారం బీఎస్‌ఈలో రూట్‌ మొబైల్‌ షేరు సుమారు 9% క్షీణించి రూ. 1,486 వద్ద క్లోజైంది.

Videos

చంద్రబాబు గుర్తుపెట్టుకో.. చీర లాగి.. ఇంత దారుణంగా కొడతారా..? జనసేన నేత వార్నింగ్

ప్రసాద్ బాబుకు ఒక న్యాయం.. ఇందిరకు మరో న్యాయమా?

విడుదల రజిని ఘటనపై ధ్రువ్ రాఠీ స్పందన

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

రెండో టీ20లో వైభవ్ కు చాన్స్.. ఇషాన్ కిషన్ అవుట్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

Photos

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు