Breaking News

ప్రత్యామ్నాయాలపై రియల్టీ ఇన్వెస్టర్ల దృష్టి

Published on Tue, 06/25/2024 - 12:02

ప్రధాన నగరాల్లో స్థిరాస్తి ధరలు భారీగా పెరగడంతో రియల్‌ఎస్టేట్‌ పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయాల కోసం ఇతర పట్టణాలపై ఆసక్తి చూపుతున్నారని ప్రాపర్టీ రీసెర్చ్ సంస్థ కొలియర్స్ ఇండియా ఒక నివేదికలో తెలిపింది. ముంబై, దిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ప్రాపర్టీ ధరలు పెరగడంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న 17 నగరాలను ప్రతిపాదించింది.

రిపోర్ట్‌లోని వివరాల ప్రకారం..దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్‌ 2030 నాటికి 1 ట్రిలియన్‌ డాలర్లు(రూ.83 లక్షల కోట్లు), 2050 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల(రూ.410 లక్షల కోట్లు)కు  చేరుతుందని అంచనా. 2050 నాటికి దేశంలో ఎనిమిది మెగాసిటీలు ఏర్పడుతాయి. నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్‌ఐపీ), పీఎం గతిశక్తి ప్రాజెక్టులు టైర్ 1 నగరాల్లో కీలకమార్పులు తీసుకొస్తాయి. మెరుగైన కనెక్టివిటీ, తయారీ కార్యకలాపాల వృద్ధి ఊపందుకుంటుంది. ఉద్యోగులు హైబ్రిడ్ వర్క్ మోడల్స్ వైపు మారడంతో చిన్న నగరాల్లో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే వృద్ధి చెందిన దిల్లీ, ముంబయి, బెంగళూరులో ప్రాపర్టీ ధరలు భారీగా పెరిగాయి. దాంతో రియల్టీ పెట్టుబడిదారులు ఇతర నగరాలపై దృష్టి పెడుతున్నారు. అందులో ప్రధానంగా ఉత్తరాన అమృత్‌సర్, అయోధ్య, జైపుర్, కాన్పూర్, లఖ్‌నపూ, వారణాసి; తూర్పున పట్నా, పూరీ; పశ్చిమాన ద్వారక, నాగ్‌పుర్, షిర్డీ, సూరత్; దక్షిణాన కోయంబత్తూర్, కొచ్చి, తిరుపతి, విశాఖపట్నం, ఇందోర్ నగరాలున్నాయి. ఈ నగరాల్లో కార్యాలయాలు, గిడ్డంగులు, టూరిజం..వంటి వాటి​​కి ప్రాధాన్యత పెరుగుతోంది.

ఇదీ చదవండి: యాపిల్‌ ఉత్పత్తుల్లో మెటా ఏఐ.. క్లారిటీ ఇచ్చిన దిగ్గజ సంస్థ

ఈ సందర్భంగా కొలియర్స్ ఇండియా సీఈఓ, బాదల్ యాగ్నిక్ మాట్లాడుతూ..‘టైర్‌1, టైర్‌ 2 నగరాల్లో పనిప్రదేశాలకు డిమాండ్‌ పెరుగుతోంది. మౌలిక సదుపాయాలు మెరుగవుతున్నాయి. పర్యాటకం (ముఖ్యంగా ఆధ్యాత్మిక పర్యాటకం), ఇంటర్నెట్ వ్యాప్తి అధికమవుతోంది. కోయంబత్తూర్, ఇందోర్, కొచ్చి శాటిలైట్ ఆఫీస్ మార్కెట్‌లుగా ఎదుగుతున్నాయి. జైపుర్, కాన్పూర్, లఖ్‌నవూ, నాగ్‌పుర్, పట్నా, సూరత్‌లు డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అమృత్‌సర్, అయోధ్య, ద్వారక, పూరీ, షిర్డీ, తిరుపతి, వారణాసి వంటి నగరాలు ఆధ్యాత్మిక పర్యాటకంలో వృద్ధి చెందుతున్నాయి’ అన్నారు.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)