Breaking News

ఇంటికి అద్దె ఇప్పిస్తారు.. అన్నీ చూసుకుంటారు!

Published on Sat, 01/03/2026 - 19:56

హైదరాబాద్‌లో తన పేరిట ఉన్న ఫ్లాట్‌కు సంబంధించిన అద్దె డబ్బులను ఆస్ట్రేలియాలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్న రాజు ప్రతినెలా అందుకుంటున్నాడు. విద్యుత్తు, ఆస్తి పన్ను బిల్లులను సకాలంలో చెల్లిస్తున్నాడు. ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా? అవును ‘ప్రాపర్టీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌’ (పీఎంఎస్‌)తో ఇది సాధ్యమే. మీ చిన్నచిన్న పనుల్ని దగ్గరుండి చేసి పెట్టడానికి ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గతంలో ఒకటో రెండో సంస్థలే ఇలాంటి సేవల్ని అందించేవి. ప్రస్తుతం డజనుకు పైగా నిర్మాణ సంస్థలు ఈ తరహా సేవల్ని అందిస్తున్నాయి.

ఈ బాధ్యతలు వీరివే.. 
పీఎంఎస్‌ అని ముద్దుగా పిలిచే ఈ సేవల ద్వారా కలిగే ప్రయోజనం అంతాఇంతా కాదు. ప్రతి పనిని దగ్గరుండి ఈ ప్రతినిధులే చూసుకుంటారు. నెల వచ్చేసరికి అద్దె చెల్లించగల వ్యక్తులకే మీ ఇంటిని లేదా ఫ్లాట్‌ను అద్దెకిస్తారు. ఇందుకు సంబంధించి మీకు అద్దెదారుడికి మధ్య ఒప్పందమూ కుదురుస్తారు. దీనికి అవసరమైన పత్రాల్ని రూపొందించే బాధ్యత వీరిదే.. అద్దెదారులు పాటించాల్సిన రూల్స్‌ను మీ తరఫున సంస్థనే ఖరారు చేస్తుంది. క్రమం తప్పకుండా అద్దె వసూలు చేసి మీ బ్యాంకు ఖాతాలో జమచేయడం వీరి సేవలో భాగమే.

నిర్వహణ భారం కూడా.. 
మీది ఫ్లాట్‌ అయితే అపార్టుమెంట్‌ సంఘానికి ప్రతినెలా నిర్వహణ ఖర్చులను ఇంటి అద్దె నుంచి చెల్లిస్తారు. ప్లంబింగ్, విద్యుత్, డ్రైనేజీ, నీటి సరఫరా తదితర సమస్యలు వస్తే వాటికి తగిన మరమ్మతులు చేయిస్తారు. అవసరమైన సందర్భాలలో మీ ఖర్చుతో ఇంటికి రంగులు వేయిస్తారు. విద్యుత్, ఆస్తి పన్ను బిల్లులను చెల్లిస్తారు.

వివాదం తలెత్తితే.. 
మీకు అద్దెదారుడికి మధ్య వివాదం వస్తే సామరస్యంగా పరిష్కరించే బాధ్యత వీరిదే.. నిర్వహణకు సంబంధించి జరిగే అన్ని సమావేశాలకు మీ ప్రతినిధిగా హాజరయ్యేది కూడా వీరే. మీరు కోరుకున్నట్లయితే ఆస్తి అమ్మకంలో సహకరిస్తారు. మంచి ధరను ఇప్పించేందుకు కృషి చేస్తారు. పని ఏదైనా మీకు తెలియకుండా జరగదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిసేవకు ఎంతో కొంత రుసుము చెల్లించాల్సిందే. ఏడాదికి ఒక నెల మీ ఫ్లాట్‌ అద్దెను ఫీజుగా వసూలు చేస్తారు. అయితే సంస్థను బట్టి వసూలు చేసే రుసుముల్లో వ్యత్యాసం ఉంటుందని మర్చిపోవద్దు.

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)