Breaking News

వేగంగా వృద్ధి చెందుతున్న రంగం

Published on Thu, 09/26/2024 - 09:07

ఉత్పత్తి ఆధారిత ప్రోత్రాహకాల(పీఎల్‌ఐ) వల్ల మొబైల్‌ తయారీ రంగం వేగంగా వృద్ధి చెందుతున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ తెలిపారు. పీఎల్‌ఐ పథకం కింద ఈ రంగం ఇప్పటికే లక్ష్యాలను అధిగమించిందని చెప్పారు. 2014-15లో రూ.1.9 లక్షల కోట్లుగా ఉన్న ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి రంగం వాటా 17.4 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2024లో రూ.9.52 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. ఇందుకు ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవ చూపినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: 32,000 మంది ఉద్యోగులు సమ్మె.. 27న చర్చలు

‘పీఎల్‌ఐ పథకం వల్ల దేశీయంగా మొబైల్ ఉత్పత్తి రంగంలో ప్రాథమికంగా రూ.9,100 కోట్ల పెట్టుబడులు సమకూరాయి. వీటివల్ల రూ.6.61 లక్షల కోట్ల విలువైన మొబైళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 2014-15లో వీటి ఎగుమతులు కేవలం రూ.1,566 కోట్లుగా ఉండేది. ప్రస్తుతం దాదాపు రూ.1.2 లక్షల కోట్లు విలువైన ఫోన్లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. 2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ రంగం దాదాపు రూ.8.12 లక్షల కోట్లు ఉత్పత్తిని సాధిస్తుందని అంచనా. పీఎల్‌ఐ పథకం వల్ల మొబైల్‌ తయారీ రంగంలో దాదాపు లక్షకు పైగా యువతకు ఉపాధి లభించింది. ఈ వృద్ధికి మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం ఎంతో తోడ్పడింది’ అని కృష్ణన్‌ తెలిపారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)