Breaking News

ప్రైవేట్‌ పెట్టుబడులూ కీలకమే

Published on Fri, 04/07/2023 - 01:32

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు పెట్టుబడులు పెరగవలసి ఉన్నట్లు పారిశ్రామిక సమాఖ్య అసోచామ్‌ తాజాగా అభిప్రాయపడింది. ప్రభుత్వ పెట్టుబడులతోనే మూలధన వ్యయాలు పుంజుకోవని, ప్రైవేటు రంగం సైతం ఇందుకు దన్నుగా నిలవాలని పేర్కొంది. రానున్న రెండు, మూడేళ్లలో ప్రైవేటు పెట్టుబడులు ఊపందుకోనున్నట్లు అసోచామ్‌కు కొత్తగా ఎంపికైన ప్రెసిడెంట్‌ అజయ్‌ సింగ్‌ అంచనా వేశారు. ఇందుకు కేంద్రం నుంచి లభిస్తున్న పెట్టుబడి వ్యయాల ప్రోత్సాహం దోహదపడగలదని తెలియజేశారు.

జోరందుకున్న ప్రభుత్వ పెట్టుబడులతో సమానంగా దేశీ కార్పొరేట్‌ పెట్టుబడులూ పెరగవలసి ఉన్నదని గత నెలలో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. తద్వారా 2023–24 కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రధాని సూచించారు. కాగా.. ఒక ఆర్థిక వ్యవస్థలో అధిక భాగం ప్రభుత్వ పెట్టుబడులే ఉండవని, ప్రైవేటు రంగం సైతం భాగస్వామి కావలసి ఉంటుందని అజయ్‌ తెలియజేశారు. మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ పెట్టుబడుల కారణంగా ప్రస్తుతం ప్రోత్సాహక వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. దీంతో కంపెనీలకు దేశ, విదేశాలలో పలు అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని తెలియజేశారు.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు