Breaking News

యువత ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం

Published on Fri, 02/28/2025 - 02:32

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు యుక్తవయస్కుల ఆరోగ్య సంరక్షణ కోసం మరిన్ని నిధులు వెచ్చించాలని, ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక సూచించింది. తద్వారా ప్రతీ డాలర్‌ వ్యయంపై 4.6 నుంచి 71.4 డాలర్ల స్థాయిలో ప్రతిఫలం లభిస్తుందని అంచనా వేసింది. ఇందుకోసం ప్రభుత్వం, ప్రవేటు రంగం నుంచి సహకారం అవసరమని సూచించింది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ, మేటర్నల్, న్యూబోర్న్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌ (పీఎంఎన్‌సీహెచ్‌) సహకారంతో ఈ నివేదిక రూపొందించింది. యుక్త వయస్కుల (కౌమరదశ/10–19 ఏళ్లు) ఆరోగ్యంపై చేసే పెట్టుబడులతో జీడీపీ ఏటా 10 శాతం మేర పుంజుకుంటుందని అంచనా వేసింది. హెచ్‌పీవీ టీకా, టీబీ చికిత్స, మయోపియా గుర్తింపు–చికిత్సకు 2024–2035 మధ్య ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. 2024–2050 మధ్య కాలంలో విద్య, ఉపాధి, బాల్య వివాహాల తగ్గింపు, రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలని సూచించింది. ఇలా యుక్త వయసు్కల ఆరోగ్యంపై చేసే పెట్టుబడులతో పెద్ద ఎత్తన ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని అభిప్రాయపడింది.  

దేశ భవిష్యత్తులో కీలక పాత్ర.. 
‘‘ఈ తరహా భవిష్యత్‌ పెట్టుబడులు దేశ జీడీపీని సగటున ఏటా 10 శాతం మేర పెరిగేలా చేస్తాయి.ప్రభుత్వం, ప్రైవేటు రంగం, పౌర సమాజం, కమ్యూనిటీలు, కుటుంబాలు కలసి ఏటా ఇందుకోసం చేసే 33 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో ఏటా 476 బిలియన్‌ డాలర్ల ప్రయోజనాలు ఒనగూడతాయి’’అని ఈ నివేదిక తెలిపింది.  ఆరోగ్యం, విద్య, బాల్య వివాహాలను అరికట్టడంపై చేసే ప్రతీ డాలర్‌ పెట్టుబడికి 4.6 డాలర్ల నుంచి 71.4 డాలర్ల వరకు ప్రతిఫలం వస్తుందని పేర్కొంది.   
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)