Breaking News

ఘనంగా జాతీయ ఆరోగ్య మేళా 2026 ప్రారంభం

Published on Thu, 02/26/2026 - 17:16

ఆయుర్వేద వైద్య విధానాల ప్రాముఖ్యతను ప్రజలకు చేరవేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న జాతీయ ఆరోగ్య మేళా 2026ను దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం అధికారికంగా ప్రారంభించారు. మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లా షెగావ్‌ పట్టణం విశావా గ్రౌండ్, భక్తినివాస్‌ కాంప్లెక్స్‌లో ఈ మేళా ఫిబ్రవరి 25 నుంచి 28 వరకు కొనసాగనుంది.

కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ, అఖిల్‌ భారతీయ ఆయుర్వేద మహాసమ్మేళన సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేళాకు ప్రఖ్యాత ఆయుర్వేద సంస్థలు బైద్యనాథ్, సిద్ధాయి ప్రధాన ప్రాయోజకులు (స్పాన్సర్షిప్‌)గా వ్యవహరించాయి. తమ స్టాళ్లలో విస్తృత శ్రేణి ఆయుర్వేద ఔషధాలు, ఆరోగ్య ఉత్పత్తులను ప్రదర్శించడంతో పాటు, ఆయుర్వేదంపై అవగాహన కల్పించే పుస్తకాలను రాయితీ ధరలకు అందుబాటులో ఉంచాయి.

ఈ మేళా ఆయుర్వేద ప్రాముఖ్యతను ప్రజలకు చేరవేయడంలో కీలకంగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ప్రతాప్‌రావు జాధవ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

#

Tags : 1

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)