Breaking News

ఆకాసాలో భారీ పెట్టుబడులకు చర్చలు

Published on Thu, 08/22/2024 - 10:41

ప్రముఖ ఎయిర్‌లైన్‌ సంస్థ ఆకాసా ఎయిర్‌లో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, క్లేపాండ్ క్యాపిటల్ వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. రెండు సంస్థలు కలిపి రూ.1,049 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.

భారత్‌లో విమానయాన ప్రయాణికులు పెరుగుతున్నారు. దాంతో చాలా కంపెనీలు దేశీయ రూట్లలో విమానాల సంఖ్యను పెంచుతున్నాయి. రానున్న రోజుల్లో టైర్‌1, 2, 3 సిటీల్లోని ప్రజలు విమానాల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతారని అంచనా వేస్తున్నాయి. దాంతో ఆయా ప్రాంతాల్లో ప్రయాణాలకు అనువైన మౌలికవసతులను అభివృద్ధి చేస్తున్నాయి. దీన్ని గమనించిన కొన్ని సంస్థలు విమానయాన కంపెనీల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగానే రూ.2,938 కోట్లు విలువైన ఆకాసా ఎయిర్‌లో తాజాగా అజీమ్‌ ప్రేమ్‌జీ కుటుంబం కన్సార్టియంగా ఉన్న ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, మణిపాల్‌ గ్రూప్‌కు చెందిన రంజన్‌పాయ్‌ ఆధ్వర్యంలోని క్లేపాండ్ క్యాపిటల్ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాయి. ఫలితంగా ఆకాసా ఎయిర్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.

ఇదీ చదవండి: ప్రైవేట్‌ బ్యాంకుల్లో తగ్గుతున్న ‘అట్రిషన్‌’

ఇదిలాఉండగా, ఇప్పటికే ఆ కంపెనీలో రాకేష్‌జున్‌జున్‌వాలా కుటుంబానికి గరిష్ఠంగా రూ.293 కోట్ల వాటా ఉంది. ఇప్పుడు ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, క్లేపాండ్ క్యాపిటల్ కలిపి దాదాపు రూ.1,049 కోట్లు ఇన్వెస్ట్‌ చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. ఇదే జరిగితే ఆకాసాలో మేజర్‌ వాటాదారులుగా ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, క్లేపాండ్ క్యాపిటల్   వ్యవహరిస్తాయి. ఆకాసాలో ప్రస్తుతం 24 ఎయిర్‌క్రాఫ్ట్‌లున్నాయి. 202 విమానాలను ఆర్డర్‌ చేశారు. 27 నగరాలకు ప్రయాణికులను చేరవేస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)