అగర్‌బత్తులకూ బీఐఎస్ ప్రమాణాలు!

Published on Fri, 12/26/2025 - 21:06

వినియోగదారుల భద్రతను.. ఇండోర్ గాలి నాణ్యతను దృష్టిలో ఉంచుకుని అగర్‌బత్తులకు బీఐఎస్ ప్రమాణాలు ఉండాలని  కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రి 'ప్రహ్లాద్ జోషి' కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగానే ''ఐఎస్ 19412:2025 – అగరుబత్తి - స్పెసిఫికేషన్‌''ను విడుదల చేశారు.

కొత్త నిబంధనల ప్రకారం.. అగర్‌బత్తులలో వినియోగదారుల ఆరోగ్యం, ఇండోర్ గాలి నాణ్యతకు, పర్యావరణానికి హాని కలిగించే కొన్ని క్రిమిసంహారక రసాయనాలు & సింథటిక్ సువాసన పదార్థాల వాడకం పూర్తిగా నిషేధం. జాబితాలో అలెత్రిన్, పెర్మెత్రిన్, సైపర్‌మెత్రిన్, డెల్టామెత్రిన్ & ఫిప్రోనిల్ వంటి కొన్ని క్రిమిసంహారక రసాయనాలు.. అలాగే బెంజైల్ సైనైడ్, ఇథైల్ అక్రిలేట్ & డైఫెనిలమైన్ వంటి సింథటిక్ సువాసన పదార్థాలు ఉన్నాయి.

కొత్త ప్రమాణాలు.. అగర్‌బత్తులను యంత్రాలతో తయారు చేసినవి, చేతితో తయారు చేసినవి మరియు సాంప్రదాయ మసాలా వర్గాలుగా వర్గీకరిస్తుంది. అంతే కాకుండా.. ముడి పదార్థాలు, బర్నింగ్ నాణ్యత, సువాసన పనితీరు & రసాయన పారామితుల కోసం స్పెసిఫికేషన్లను నిర్దేశిస్తుంది. దీంతో అగర్‌బత్తులు బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా తయారవుతాయి. ఇవి మానవ, పర్యావరణ హితంగా ఉంటాయి. దీనివల్ల ఉత్పత్తులపై ప్రజలకు నమ్మకం పెరగడం మాత్రమే కాకుండా.. మన దేశ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది.

అగర్‌బత్తుల ఉత్పత్తి, ఎగుమతుల్లో భారత్..
ప్రపంచంలో అగర్‌బత్తుల ఉత్పత్తి & ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. కర్ణాటకలోని మైసూరు, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు అగరుబత్తీ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఈ పరిశ్రమ పెద్ద ఎత్తున ఉపాధిని కల్పిస్తోంది. మన దేశం సుమారు 150 దేశాలకు అగర్‌బత్తులను ఎగుమతి చేస్తున్నట్లు కొన్ని గణాంకాలు చెబుతున్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)