Breaking News

పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ రూ. 4.50 డివిడెండ్‌

Published on Thu, 02/08/2024 - 04:53

న్యూఢిల్లీ: పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి పనితీరు పరంగా రాణించింది. క్రితం ఏడాది ఇదే కాలంలోని లాభం రూ.3,645 కోట్లతో పోల్చి చూసినప్పుడు 11 శాతం పెరిగి రూ.4,028 కోట్లకు చేరింది. ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.11,530 కోట్ల నుంచి రూ.11,820 కోట్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో రూ.7,690 కోట్ల మూలధన వ్యయాలను వినియోగించింది.

డిసెంబర్‌ త్రైమాసికంలో ఆరు అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌ ప్రాజెక్టులను బిడ్డింగ్‌లో గెలుచుకుంది. వీటి నిర్మాణ అంచనా వ్యయం రూ.20,479 కోట్లుగా ఉంది. డిసెంబర్‌ చివరికి పవర్‌గ్రిడ్‌ సంస్థ నిర్వహణలోని ట్రాన్స్‌మిషన్‌ ఆస్తుల నిడివి 1,76,530 సర్క్యూట్‌ కిలోమీటర్లుగా ఉంది. అలాగే, 276 సబ్‌ స్టేషన్లు, 5,17,860 మెగావోల్ట్‌ యాంపియర్స్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రెండో మధ్యంతర డివిడెండ్‌ కింద రూ.4.50 చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)