Breaking News

తెలుగు వెబ్‌సిరీస్‌ తొలగించాలని కోర్టులో పిటిషన్‌

Published on Thu, 06/13/2024 - 13:25

పాకెట్ఎఫ్‌ఎం సంస్థ తన ఆడియో సిరీస్ కాపీరైట్‌ను డిస్నీ+ హాట్‌స్టార్‌ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. కోర్టు వెంటనే స్పందించి సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.

పిటిషన్‌లోని వివరాల ప్రకారం..ఆన్‌లైన్‌ ఆడియో ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫామ్ పాకెట్ఎఫ్ఎం తన ఆడియో సిరీస్‌ 'యక్షిణి'ని పెయిడ్‌ కస్టమర్లకు అందిస్తోంది. దానికి సంబంధించిన పూర్తి కాపీరైట్ హక్కులు సంస్థ కలిగి ఉంది. ఇటీవల వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్‌ ‘యక్షిణి’ని పోలిఉండే వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌ విడుదల చేసింది. పాకెట్‌ఎఫ్‌ఎం వెంటనే దాన్ని సదరు ప్లాట్‌ఫామ్‌ నుంచి తొలగించాలని కోరుతూ జూన్‌ 11న దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

ఇదిలాఉండగా, జూన్‌ 14 నుంచి ఈ తెలుగు వెబ్‌సిరీస్‌ ప్రారంభం కాబోతుందని డిస్నీ+ హాట్‌స్టార్‌ ప్రకటించింది. దాంతో పాకెట్‌ఎఫ్‌ఎం డిస్నీ+ హాట్‌స్టార్‌ మాతృసంస్థ అయిన నోవీ డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై కోర్టులో దావా వేసింది. వెబ్‌సిరీస్‌ ట్రైలర్‌ను తొలగించేలా సంస్థను ఆదేశించాలని కోర్టును అభ్యర్థించింది.

ఇదీ చదవండి: సిమ్‌ కార్డు, వై-ఫై కనెక్షన్‌ లేకపోయినా మెసేజ్‌లు పంపాలా..?

ఈ వ్యాజ్యం గురువారం జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ వ్యవహారంపై డిస్నీ+ హాట్‌స్టార్ తన ప్రత్యుత్తరాన్ని దాఖలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మే 2021 నుంచి పాకెట్‌ఎఫ్‌ఎం ప్లాట్‌ఫామ్‌లో ‘యక్షిణి’ ఆడియో సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి