Breaking News

ఖాతాదారులకు గట్టిషాకిచ్చిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌..!

Published on Tue, 04/05/2022 - 15:53

ప్రముఖ బ్యాంకింగ్‌ దిగ్గజం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తన ఖాతాదారులకు గట్టి షాక్‌ను ఇచ్చింది. ఖాతాదారుల సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సవరించిన వడ్డీ రేట్లు ఏప్రిల్‌ 4, 2022 నుంచి అమలులోకి రానుంది. 

ఖాతాదారులకు నిరాశపరుస్తూ వడ్డీరేట్లను పీఎన్‌బీ తగ్గించింది. 10 లక్షల లోపు బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీ రేట్లను ఏడాదికి గాను  2.70 శాతానికి తగ్గించినట్లు పీఎన్‌బీ ప్రకటించింది. అంతేకాకుండా  రూ.10 లక్షల నుంచి రూ.500 కోట్ల మధ్య బ్యాలెన్స్ ఉన్న  సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీ రేటును ఏడాదికి 2.75 శాతానికి తగ్గిస్తూ పీఎన్‌బీ నిర్ణయం తీసుకుంది. సవరించిన వడ్డీ  రేట్లు డొమెస్టిక్‌, ఎన్‌ఆర్‌ఐ ఖాతాదారులకు వర్తించనుంది. 

పీఎన్‌బీ తీసుకున్న నిర్ణయంతో లక్షల మంది డిపాజిటర్లను ప్రభావితం చేయనుంది.  వీరిలో చాలా మందికి రూ.10 లక్షల కంటే తక్కువ ఖాతా నిల్వలు ఉన్నాయి.  రెండు నెలల సమయంలో రెండోసారి డిపాజిట్‌దారుల పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును పీఎన్‌బీ మరింత తగ్గించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పొదుపు ఖాతాపై రేటు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రెండు రోజుల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నెల వారీ ద్రవ్య విధాన కమిటీ సమావేశం జరిగే నేపథ్యంలో పీఎన్‌బీ వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 

పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో భాగంగా స్వల్పకాలిక డిపాజిట్లపై 0.5 శాతం నుంచి 0.75 శాతం వరకు వడ్డీ రేట్లు ఇస్తోంది. మధ్యస్థ, దీర్ఘకాలిక డిపాజిట్లపై సంవత్సరానికి 2.25 శాతం, 2.5 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది. 

చదవండి: స్టాక్స్‌లో ఎక్కువ ఇన్వెస్ట్‌ చేస్తున్నది తెలుగువారే..

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)