Breaking News

పంజాబ్ నేషనల్ బ్యాంక్: జులై 1 నుంచి ఆ ఖాతాలు క్లోజ్‌!

Published on Wed, 06/19/2024 - 16:39

PNB Alert: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ కోట్లాది మంది ఖాతాదారులకు అప్రమత్తం చేసింది. ఈ బ్యాంకులో పొదుపు ఖాతా ఉండి గత కొన్నేళ్లుగా ఉపయోగించకపోతే జూలై 1 తర్వాత అలాంటి ఖాతాలు రద్దు కానున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ విషయాన్ని చెబుతోంది. సేవింగ్స్‌ అకౌంట్‌ భద్రతను దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.

మీకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉంటే ముందుగా దాని స్టేటస్ చెక్ చేసుకోండి. ఈ నెలాఖరు కల్లా వాడుకలో లేని ఖాతాలను బ్యాంక్‌ మూసివేయనుంది. గత మూడేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతాలను, అలాగే గత మూడేళ్లుగా అకౌంట్ బ్యాలెన్స్ సున్నా ఉన్న అకౌంట్లను క్లోజ్ చేయబోతున్నట్లు బ్యాంకు తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. అలాంటి కస్టమర్లకు ఇప్పటికే నోటీసులు సైతం పంపించింది.

వాడుకలో లేని ఖాతాలకు కేవైసీ చేయించుకోవాలని పీఎన్‌బీ కొన్ని రోజుల క్రితమే ఖాతాదారులకు తెలియజేసింది. అయితే ఈ గడువును జూన్ 30 వరకు పొడిగించింది. ఆ తర్వాత జూలై 1 నుంచి ఈ ఖాతాలు క్లోజ్ అవుతాయి. చాలా కాలంగా కస్టమర్లు ఉపయోగించని ఇలాంటి ఖాతాలను చాలా మంది మోసగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి కేసులను ఎదుర్కోవడానికి బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఖాతా లెక్కింపు  2024 ఏప్రిల్ 30 ఆధారంగా జరుగుతుంది.

తిరిగి యాక్టివేట్ చేసుకోండిలా..
బ్యాంకు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. అకౌంట్‌ ఇన్‌యాక్టివ్ అయి, ఖాతాదారు అకౌంట్‌ను తిరిగి యాక్టివేట్ చేయాలనుకుంటే బ్రాంచ్ కు వెళ్లి కేవైసీ ఫారాన్ని నింపాల్సి ఉంటుంది. కేవైసీ ఫారంతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను కూడా జత చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. కస్టమర్లు మరింత సమాచారం కోసం బ్యాంకును సం‍ప్రదించవచ్చు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)