Breaking News

దేశంలో మౌలిక సదుపాయాలకు చేసే ఖర్చు ఎంతంటే..

Published on Sat, 06/29/2024 - 13:32

దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రధానమంత్రి గతి శక్తి పథకం ఎంతో ఉపయోగపడిందని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. 2029 నాటికి మౌలిక సదుపాయాల వృద్ధికి జీడీపీలో 6.5 శాతం ఇన్వెస్ట్‌ చేస్తారని అంచనావేస్తూ నివేదిక విడుదల చేసింది.

నివేదికలోని వివరాల ప్రకారం..ప్రధానమంత్రి గతి శక్తి పథకంతో భారతదేశ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతున్నాయి. హైవే, రైల్వే, ఓడరేవులు వంటి సదుపాయాలు మెరుగయ్యాయి. ‘మల్టీ మోడల్ కనెక్టివిటీ’తో భారత రవాణా వ్యవస్థ దూసుకుపోతుంది. దేశ జీడీపీలో మౌలిక సదుపాయాల కల్పనకు 2023-24లో 5.3 శాతం వెచ్చించారు. క్రమంగా ఇది పెరుగుతూ 2029 నాటికి 6.5 శాతానికి చేరుతుంది. దాని ఫలితంగా రాబోయే ఐదేళ్లలో ఆర్థిక వ్యవస్థ భారీగా పెరుగుతుంది.

‘ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్స్ ఇండెక్స్ 2023 నివేదిక ప్రకారం..భారత షిప్‌యార్డ్‌ల్లో కంటైనర్లు ఉండే సగటు సమయాన్ని ముడు రోజులకు తగ్గించారు. అందుకోసం హైవేలు, రైల్వేలు ఎంతో తోడ్పడుతున్నాయి. ఇది యూఏఈ, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో నాలుగు రోజులు, యూఎస్‌ఏలో ఏడు రోజులు, జర్మనీలో పది రోజులుగా ఉంది. భారతీయ ఓడరేవుల ‘టర్నరౌండ్ సమయం(అన్‌లోడ్‌ చేసి లోడ్‌ చేయడానికి పట్టే సమయం)’ 0.9 రోజులకు చేరుకుంది. ఇది యూఎస్‌ఏలో 1.5 రోజులుగా, ఆస్ట్రేలియాలో 1.7 రోజులుగా, సింగపూర్‌లో ఒక రోజుగా ఉంది. అక్టోబరు 2021లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం పీఎం గతి శక్తి పథకాన్ని ప్రారంభించారు. దీని కింద ఇప్పటివరకు పోర్ట్‌లు, షిప్పింగ్ రంగాల్లో రూ.60,900 కోట్ల విలువైన 101 ప్రాజెక్టులు గుర్తించారు. ఏప్రిల్ 2023 నాటికి ​రూ.8,900 కోట్ల విలువైన 26 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. రూ.15,340 కోట్ల విలువైన 42 ప్రాజెక్టులు అభివృద్ధిలో ఉన్నాయి. రూ.36,640 కోట్ల విలువైన 33 ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి’ అని మోర్గాన్‌ స్టాన్లీ తెలిపింది.

ఇదీ చదవండి: ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌ కావాలంటే.. సీఈఓ సూచన

సాగరమాల కార్యక్రమం కింద రూ.1.12 లక్షల కోట్ల విలువైన 220 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. రూ.2.21 లక్షల కోట్ల విలువైన 231 ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి. రూ.2.07 లక్షల కోట్ల విలువైన 351 ప్రాజెక్టులు మూల్యాంకన దశలో ఉన్నాయని మోర్గాన్ స్టాన్లీ నివేదిక పేర్కొంది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)