పెరగనున్న ఫర్నిచర్ ధరలు.. కారణం ఇదే..

Published on Sat, 06/08/2024 - 21:31

దేశంలో ఫర్నిచర్ ధరలు వచ్చే ఏడాది పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నుంచి ప్లైవుడ్ తయారీదారులందరికీ ఐఎస్‌ఐ (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్‌స్టిట్యూషన్) సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తా సంస్థ ‘మింట్‌’ నివేదించింది. బాయిలింగ్ వాటర్ ప్రూఫ్‌గా ప్రచారం చేసే ప్లైవుడ్‌కు ఆ మేరకు ఐఎస్‌ఐ సర్టిఫికేషన్ కూడా అవసరముంటుందని ఇద్దరు అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది.

ఫర్నిచర్, ఇతర వస్తువుల్లో ఉపయోగించే ప్లైవుడ్ నాణ్యత, మన్నికను మెరుగుపరచడం, సవాళ్లతో కూడిన వాతావరణంలో కూడా అవి ఎక్కువ కాలం ఉండేలా చూడటం లక్ష్యంగా ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, నేపాల్ నుంచి నాసిరకం ప్లైవుడ్ దిగుమతిని అరికట్టవచ్చని భావిస్తున్నారు. కొత్త ప్రమాణాల ప్రకారం ప్లైవుడ్ తయారీదారులు అన్ని గ్రేడ్ల ప్లైవుడ్‌కు ఫంగల్ నిరోధకత కోసం మైకోలాజికల్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ఈ నిబంధనపై ప్లైవుడ్ మేకర్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొత్త ప్రమాణాలు ప్లైవుడ్ నాణ్యతను మెరుగుపరుస్తాయని, వినియోగదారులతో పాటు  తయారీదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని కొందరు చెబుతుండగా మరికొందరు దీన్ని ఈ చర్యను వ్యతిరేకిస్తున్నారు.

అయితే ఈ నిర్ణయం వల్ల వచ్చే ఏడాది ప్లైవుడ్ ధరలు 15 శాతం పెరుగుతాయని ఆల్ ఇండియా ప్లైవుడ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ చైర్మన్ నరేష్ తివారీ తెలిపారు. నాసిరకం ప్లైవుడ్ ఉత్పత్తుల దిగుమతిపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ప్లైవుడ్ తయారీదారులందరూ బీఐఎస్ నిబంధనలను పాటించాలని కోరారు. కాగా దీనిపై అటు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి గానీ, బీఐఎస్ ప్రతినిధుల నుంచి గానీ ఎలాంటి స్పందన లేదు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)