Breaking News

బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేత..?

Published on Thu, 07/11/2024 - 14:25

బాస్మతీయేతర బియ్యంపై నిషేధాన్ని ఎత్తివేసేందుకు మంత్రుల బృందం సమావేశం కానున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. డిమాండ్-సరఫరా, ధరల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని చర్చలు జరుగుతాయని ఫిక్కీ నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘బస్మతియేతర బియ్యం ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలనే డిమాండ్‌ ఉంది. మంత్రుల బృందంతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటాం. వ్యవసాయ ఉత్పత్తులు, వినియోగ విధానాలు, రిటైల్, హోల్‌సేల్ మార్కెట్‌లో ధరలు..వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని సహేతుక నిర్ణయం వెల్లడిస్తాం. నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి భారతీయ ఎగుమతి విధానాలపై వ్యాపారులకు సరైన అవగాహన ఉంది. దేశంలో ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విలువ 56 బిలియన్‌ డాలర్లు(రూ.4.6 లక్షల కోట్లు)కు చేరుకుంది. భారత్‌ ఎగుమతి చేస్తున్న కొన్ని ఉత్పత్తుల్లో సమస్యలున్నట్లు ఆరోపణలున్నాయి. వాటిని పరిష్కరించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) పనిచేస్తోంది’ అన్నారు.

ఇదీ చదవండి: అతిథుల కోసం 3 ఫాల్కన్‌ జెట్‌లు, 100 విమానాలు

దేశీయంగా సరఫరాను పెంచడానికి జులై 20, 2023 నుంచి బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించారు. దాంతో స్థానికంగా బియ్యం పండిస్తున్న రైతులకు సరైన ధరలు లభించడం లేదనే వాదనలున్నాయి. రైతులు, వ్యాపారులు బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేయాలని కోరుతున్నారు. దాంతో ప్రభుత్వం మంత్రుల బృందంతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఉప్పుడు బియ్యం(పార్‌బాయిల్డ్‌ రైస్‌)పై ఎగుమతి సుంకాన్ని టన్నుకు 100 డాలర్లు(రూ.8,300)గా నిర్ణయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ వెరైటీ బియ్యంపై ప్రస్తుతం 20 శాతం ఎగుమతి సుంకాన్ని వసూలు చేస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)