Breaking News

యూరోపియన్‌ స్వేచ్ఛా వాణిజ్య కూటమితో డీల్‌

Published on Tue, 02/11/2025 - 09:00

యూరోపియన్‌ స్వేచ్ఛా వాణిజ్య కూటమి (ఈఎఫ్‌టీఏ)తో చేసుకున్న వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (టెపా)తో భారత్‌ 400–500 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.43.5 లక్షల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించగలదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈఎఫ్‌టీఏ సభ్య దేశాల నుంచి 15 ఏళ్ల కాలంలో 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు హామీ ఇచ్చినప్పటికీ, వాస్తవంగా నాలుగైదు రెట్లు అధికంగా ఎఫ్‌డీఐ దేశంలోకి వస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు.

ఈ ఒప్పందం ఈ ఏడాది చివరి నాటికి అమల్లోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈఎఫ్‌టీఏలో ఐస్‌ల్యాండ్, లీచెన్‌స్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్‌ సభ్య దేశాలుగా ఉండడం గమనార్హం. ఈఎఫ్‌టీఏ కోసం ఉద్దేశించిన ప్రత్యేకమైన డెస్క్‌ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి గోయల్‌ మాట్లాడారు. ఈ ఒప్పందం కింద స్విస్‌ వాచీలు, చాక్లెట్లు, కట్, పాలిష్డ్‌ వజ్రాల దిగుమతులను చాలా తక్కువ రేటుపై లేదా సున్నా రేటుపై భారత్‌ అనుమతించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రతిఫలంగా సభ్య దేశాలు ఇచ్చిన హామీలో భాగంగా 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నది అంచనా. నాలుగు సభ్య దేశాలు ఈ ఒప్పందం ఆమోదం దిశగా కీలకమైన చర్యలు తీసుకున్నాయంటూ, ఈ ఏడాది చివరికి ఇవి అమల్లోకి రావచ్చని మంత్రి గోయల్‌ చెప్పారు.

ఇదీ చదవండి: 462 కంపెనీలపై దర్యాప్తు!

పారిశ్రామిక స్మార్ట్‌ సిటీల్లో కేటాయింపులు

ఎన్‌ఐసీడీసీ అభివృద్ధి చేస్తున్న 20 పారిశ్రామిక స్మార్ట్‌ పట్టణాల్లో ప్రత్యేకంగా కొంత భాగాన్ని ఈఎఫ్‌టీఏ సభ్య దేశాలకు ఆఫర్‌ చేయనున్నట్టు మంత్రి గోయల్‌ తెలిపారు. లేదా బడ్జెట్‌లో ప్రకటించినట్టు 100 హబ్‌ అండ్‌ స్పోక్‌ పారిశ్రామిక కేంద్రాలను కేటాయించనున్నట్టు తెలిపారు. ఈ దిశగా ఆయా దేశాలతో చర్చలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈఎఫ్‌టీఏ–భారత్‌ మధ్య 2023–24లో 24 బిలియన్‌ డాలర్ల (రూ.2.08 లక్షల కోట్లు) ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైనట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా స్విట్జర్లాండ్‌ మొదటి స్థానంలో ఉంటే, ఆ తర్వాతి స్థానంలో నార్వే ఉంది. 2000–2004 మధ్య స్విట్జర్లాండ్‌ నుంచి భారత్‌కు 10.72 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌