ఆరు ఉపగ్రహాలను ప్రయోగించనున్న స్టార్టప్‌ సంస్థ

Published on Tue, 05/28/2024 - 15:08

బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ పిక్సెల్  తయారుచేస్తున్న ఉపగ్రహాలను 2024 చివరినాటికి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం స్పేస్‌ఎక్స్‌కు చెందిన రైడ్‌షేర్ మిషన్లు, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ)ను ఉపయోగించాలని కంపెనీ యోచిస్తోంది.

ఈ సందర్భంగా పిక్సెల్‌ సీఈఓ అవైస్ అహ్మద్ మాట్లాడుతూ..‘కంపెనీకు స్పేస్‌ఎక్స్‌, పీఎస్‌ఎల్‌వీ రెండింటిలోనూ ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. అయితే, ఇది ఉపగ్రహాల సంసిద్ధత, ప్రయోగ షెడ్యూల్‌పై ఆధారపడి ఉంటుంది. సంస్థ వద్ద ప్రస్తుతం ఏటా 40 పెద్ద ఉపగ్రహాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం పరిశోధకుల బృందం ఆరు ఉపగ్రహాలపై పని చేస్తోంది. వీటిని ఈ ఏడాది చివరినాటికి అంతరిక్షంలోని ప్రవేశపెట్టనున్నా​ం. 2024లో మరిన్ని ఉపగ్రహాలను తయారుచేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మోదీ ప్రధాని అయినా, అవ్వకపోయినా అందులో మార్పులేదు

ఈ ఏడాది జనవరిలో పిక్సెల్ బెంగుళూరులో 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ‘మెగాపిక్సెల్’ అనే ఫెసిలిటీని ప్రారంభించింది. ఇందులో ఆరు హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజరీ ఉపగ్రహాలను ప్రయోగాలు జరుపుతున్నారు. ఇవి వ్యవసాయం, ఎనర్జీ, అటవీ, పర్యావరణ పర్యవేక్షణతో సహా వివిధ పరిశ్రమలకు ఉపయోగపడుతాయని కంపెనీ వర్గాలు చెప్పాయి. 2022లో పిక్సెల్‌ స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్-9 రాకెట్‌ను ఉపయోగించి ‘శకుంతల’ (టెక్నాలజీ డెమోన్‌స్ట్రేటర్-2) ఉపగ్రహాన్ని ప్రయోగించింది.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)