Breaking News

అటెన్షన్‌.. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.46 వేలు జమ!

Published on Tue, 01/06/2026 - 16:38

ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రభుత్వాలు రకరకాల పథకాలను ఆచరణలోకి తెస్తున్నాయి. పోను.. పోను.. వాటి కోసం ప్రజా ధనం కూడా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఉచితాల విషయంలో విమర్శలు వినవస్తున్నా.. కోర్టులు అక్షింతలు వేస్తున్నా వెనక్కి మాత్రం తగ్గడం లేదు. రూ.46 వేలు జమ చేయడం కూడా ఇలాంటిదేమో అని అనుకునేవాళ్లు లేకపోలేదు.

ప్రస్తుతం మన దేశంలో అన్ని వయసులవారికి.. రకరకాల పథకాలు అమలు అవుతున్నాయి. వాటిల్లో చాలామందికి చాలావాటిపై అవగాహన ఉండడం లేదు. దీంతో.. ప్రభుత్వాలే అందుకు సంబంధించిన సమాచారాన్ని వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇదే అదనుగా స్కామర్లు కూడా రెచ్చిపోతున్నారు. 

సోషల్ మీడియా యూజర్లను, అమాయక ప్రజలను మోసం చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త పన్నాగాలు పన్నుతున్నారు. ఇదే తరహా మోసం తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది ఎంతవరకు నిజం అనే విషయాన్ని.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వివరించింది. దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లింక్‌పై క్లిక్ చేసి.. మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకుంటే ప్రభుత్వం నుంచి రూ. 46,715 పొందండి. ఇది నమ్మశక్యంగా అనిపించడం లేదా? మరోసారి ఆలోచించండి! అనే ఒక మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ పేదలకు రూ. 46,715 సహాయం అందిస్తోందట అని కొందరు మోసగాళ్లు ప్రచారం చేస్తున్నారు.

దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందిస్తూ.. ఆర్థిక మంత్రిత్వ శాఖ పేదలకు రూ. 46,715 సహాయం అందిస్తుందని వైరల్ అవుతున్న వార్తను ఎవరూ నమ్మకండి. ఇదంతా అబద్దం అని స్పష్టం చేసింది. ఇలాంటి ఒక పథకం గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించలేదని వెల్లడించింది.

ఫేక్ సందేశాల పట్ల జాగ్రత్త
సోషల్ మీడియాలో ఫేక్ సందేశాలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో.. తప్పుడు లింక్స్ పంపించి.. డబ్బు దోచేస్తున్నారు. కాబట్టి తెలియని లింక్స్ లేదా తెలియని మొబైల్ నంబర్ల నుంచి వచ్చే ఎలాంటి లింక్స్ మీద క్లిక్ చేయకూడదు. మోసాల భారి నుంచి బయటపడటానికి ఉత్తమ మార్గం అపరిచిత లింకులపై క్లిక్ చేయకుండా ఉండటమే.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)