Tirupati District: భారీ వర్షంతో పొంగిన వాగు విద్యార్థుల అష్టకష్టాలు
Breaking News
ఫిజిక్స్‌వాలా @ రూ. 103–109
Published on Fri, 11/07/2025 - 04:03
న్యూఢిల్లీ: విద్యా సంబంధ స్టార్టప్(ఎడ్‌టెక్ యూనికార్న్) ఫిజిక్స్‌వాలా పబ్లిక్ ఇష్యూకి రూ. 103–109 ధరల శ్రేణి నిర్ణయించింది. ఇష్యూ ఈ నెల 11న ప్రారంభమై 13న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 10న షేర్లను ఆఫర్ చేయనుంది. ఇష్యూలో భాగంగా రూ.3,100 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.
వీటికి జతగా మరో రూ.380 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ప్రమోటర్లలో అలఖ్ పాండే, ప్రతీక్ బూబ్ ఒక్కొక్కరూ రూ. 190 కోట్ల విలువైన వాటా ఆఫర్ చేయనున్నారు. ప్రస్తుతం ఇరువురూ కంపెనీలో 40.31% చొప్పున వాటా కలిగి ఉన్నారు. లిస్టింగ్‌లో కంపెనీ రూ. 31,500 కోట్ల మార్కెట్ విలువను అంచనా వేస్తోంది.
కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ ఇదీ..: ఫిజిక్స్‌వాలా ప్రధానంగా జేఈఈ, నీట్, గేట్, యూపీఎస్‌సీ పోటీ పరీక్షల టెస్ట్ ప్రిపరేషన్ కోర్సులు ఆఫర్ చేస్తోంది. యూట్యూబ్, వెబ్‌సైట్, యాప్స్ తదితర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా నైపుణ్యపెంపు కార్యక్రమాలు చేపడుతోంది. ఆఫ్‌లైన్, హైబ్రిడ్ సెంటర్లను నిర్వహిస్తోంది. ఫిజిక్స్ వాలా–అలఖ్ పాండే యూట్యూబ్ చానల్‌కు 1.37 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్లను సాధించింది. కంపెనీలో పీఈ దిగ్గజాలు వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్, హార్న్‌బిల్, జీఎస్‌వీ వెంచర్స్‌కు పెట్టుబడులున్నాయి. గతేడాది (2024–25)లో ఆదాయం రూ. 1,941 కోట్ల నుంచి రూ. 2,887 కోట్లకు జంప్‌చేసింది. నష్టాలు రూ. 1,131 కోట్ల నుంచి రూ. 243 కోట్లకు భారీగా తగ్గాయి.
Tags : 1