Breaking News

ఫోన్‌పే దూకుడు.. కొత్త వ్యాపారాలకు నిధుల సమీకరణ

Published on Wed, 04/12/2023 - 18:40

వాల్‌మార్ట్‌ యాజమాన్యంలోని భారతీయ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే (PhonePe) దూకుడు పెంచింది. వ్యాపార విస్తరణ కోసం నిధుల సమీకరణ చేపట్టిన ఫిన్‌టెక్‌ కంపెనీ అందులో భాగంగా తాజాగా మరో 100 మిలియన్‌ డాలర్లను (సుమారు రూ.820 కోట్లు) సమీకరించింది. 

(గూగుల్‌ చీకటి ‘గేమ్‌’! రూ.260 కోట్ల భారీ జరిమానా..)

12 బిలియన్‌ డాలర్ల వాల్యుయేషన్‌ ఉన్న ఫోన్‌పే వ్యాపార విస్తరణలో భాగంగా 1 బిలియన్‌ డాలర్లను విడతలవారీగా సమీకరించినట్లు గత జనవరిలో ప్రకటించింది. అప్పటి నుంచి ఈ ఫిన్‌టెక్ కంపెనీ జనరల్ అట్లాంటిక్ నుంచి 350 మిలియన్‌ డాలర్లు, టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, రిబ్బిట్ క్యాపిటల్, టీవీఎస్‌ క్యాపిటల్ నుంచి 100 మిలియన్‌ డాలర్లు, వాల్‌మార్ట్ నుంచి 200 మిలియన్‌ డాలర్లు సమీకరించింది.

(ఆండ్రాయిడ్‌ యూజర్లకు కొత్త ఫీచర్‌.. స్టోరేజ్‌ సమస్యకు పరిష్కారం)

భారతదేశంలో తమ చెల్లింపులు, బీమా వ్యాపారాలను విస్తరించడంతో పాటు బ్యాంకింగ్‌,  స్టాక్‌బ్రోకింగ్, ఓఎన్‌డీసీ ( ఓపెన్ నెట్‌వర్క్ ఫర్‌ డిజిటల్ కామర్స్‌) ఆధారిత షాపింగ్‌ వంటి కొత్త వ్యాపారాలను ప్రారంభించేందుకు సమీకరించిన నిధులను వినియోగించనున్నట్లు ఫోన్‌పే గత ప్రకటనల్లో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలోనే ‘పిన్‌కోడ్‌’ అనే ఓఎన్‌డీసీ ఆధారిత ఈ-కామర్స్ వ్యాపారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)