Breaking News

వినూత్న ఉత్పత్తులపై ఫార్మా ఫోకస్‌ చేయాలి

Published on Thu, 11/27/2025 - 07:24

ప్రపంచ ఫార్మసీగా భారత్‌ తన స్థానాన్ని నిలబెట్టాలంటే వచ్చే అయిదేళ్లలో దేశీ ఫార్మా పరిశ్రమ క్రమంగా వినూత్నమైన, సంక్లిష్టమైన జనరిక్స్‌ తయారీ వైపు మళ్లాలని ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఫార్మెక్సిల్‌ చైర్మన్‌ నమిత్‌ జోషి చెప్పారు. బయోసిమిలర్లు, బయోలాజిక్స్, పెప్టైడ్‌లు మొదలైన వాటిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

అంతర్జాతీయంగా పోటీ, భౌగోళిక–రాజకీయ ఒత్తిళ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో కేవలం పేటెంట్లు ముగిసిన ఉత్పత్తులనే తయారు చేయడం కాకుండా పరిశోధనల ఆధారిత ఆవిష్కరణలవైపు మళ్లాల్సిన అవసరం ఉందని జోషి చెప్పారు. జనరిక్‌ మార్కెట్‌ స్థాయిని దాటి ఇతర విభాగాల్లోనూ భారత్‌ స్థానాన్ని పటిష్టం చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉందని సీపీహెచ్‌ఐ–పీఎంఈసీ ఇండియా 18వ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు.

అమెరికా టారిఫ్‌ల ముప్పుపై ఆందోళన నెలకొన్నప్పటికీ ఈ ఏడాది ఎగుమతులు ఇప్పటివరకు వృద్ధి బాటలోనే ఉన్నాయని, 2.31 శాతం పెరిగాయని జోషి చెప్పారు. ఇక ఫార్మసీ బోధనాంశాల్లో కూడా మార్పులు చేయాల్సి ఉందని సదస్సులో పాల్గొన్న కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత సిలబస్‌ అనేది వాస్తవ పరిస్థితులను, నేటి ఫార్మా వ్యవస్థ అవసరాలను ప్రతిబింబించేలా ఉండటం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్‌ డిస్కవరీ, రీసెర్చ్‌ మెథడాలజీల నుంచి ముడి వస్తువుల సేకరణ, ఏఐ ఆధారిత ఫార్ములేషన్‌ డెవలప్‌మెంట్‌లాంటి అన్ని అంశాల 
గురించి విద్యార్థుల్లో అవగాహనను పెంపొందించేలా పాఠ్యాంశాలు ఉండాలని తెలిపారు.

Videos

దళిత IPSలపై వివక్ష.. CID చీఫ్ కు నోటీసులు

ఒక్కరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే.. పదేళ్ల జైలు శిక్ష..!

క్లైమాక్స్ కు కుర్చీ వార్!

అనంతపురం జిల్లాలో దారుణం.. కొడుకు గొంతుకోసి తల్లి ఆత్మహత్య..

తుఫాన్ అలర్ట్.. దూసుకొస్తున్న దిత్వా

మసిబొగ్గుల్లా భవనాలు.. మంటల్లో 300 మంది

అనుచరులతో మా ఇంటికొచ్చి..! బాధితురాలు సంచలన నిజాలు

మహిళ అని కూడా చూడకుండా చీర పట్టుకొని లాక్కెళ్లి.. కాళ్లతో తన్నుతూ..!!

దళారుల రాజ్యం! ధాన్యం కొనుగోలు గందరగోళం

నా ప్రాణాలు పోయినా.. నిన్ను మాత్రం.. కోటంరెడ్డికి నెల్లూరు మేయర్ భర్త ఛాలెంజ్

Photos

+5

స్వామి అయ్యప్ప పడిపూజలో వితికా షేరు దంపతులు

+5

సింపుల్‌గా మరింత అందంగా అనసూయ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ డైరెక్టర్ (ఫొటోలు)

+5

అరుణాచలంలో జబర్దస్త్ కమెడియన్ పంచ్‌ ప్రసాద్ ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

Rahul Sipligunj - Harinya Reddy : వైభవంగా సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ వివాహం (ఫొటోలు)

+5

దుబాయిలో చిల్ అవుతున్న అప్సరరాణి (ఫొటోలు)

+5

రాజన్న చైల్డ్‌ ఆర్టిస్ట్‌.. చీరకట్టులో ఎంత బాగుందో! (ఫోటోలు)

+5

‘ఆంధ్రా కింగ్ తాలూకా’మూవీ రిలీజ్ ట్రెండింగ్ లో భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

‘మరువ తరమా’ సినిమా ప్రీ రిలీజ్(ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)