పెట్రోల్‌కు పెరిగిన డిమాండ్‌

Published on Wed, 08/02/2023 - 04:31

న్యూఢిల్లీ: పెట్రోల్‌ విక్రయాలు జూలైలో గతేడాది ఇదే నెలతో పోల్చినప్పుడు 4 శాతం వరకు పెరిగాయి. 2.76 మిలియన్‌ టన్నుల అమ్మకాలు నమోదయ్యాయి. ముఖ్యంగా జూలై మాసంలో మొదటి 15 రోజుల్లో పెట్రోల్‌ వినియోగం తగ్గగా, తదుపరి 15 రోజుల్లో గణనీయంగా పుంజుకుంది. అయితే నెలవారీగా (జూన్‌తో పోలి్చనప్పుడు) చూస్తే పెట్రోల్‌ అమ్మకాలు 4.6 శాతం తగ్గాయి. మరోవైపు డీజిల్‌ అమ్మకాల్లో విరుద్ధమైన పరిస్థితి కనిపించింది.

ప్రధానంగా డీజిల్‌ను రవాణా రంగంలో వినియోగిస్తారు. కనుక, వర్షాల ప్రభావం వినియోగంపై పడినట్టు తెలుస్తోంది. డీజిల్‌ అమ్మకాలు 4.3 శాతం తగ్గి 6.15 మిలియన్‌ టన్నులుగా నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే పెట్రోలియం ఉత్పత్తి ఇదే కావడం గమనార్హం. వర్షాల సమయంలో ఏటా డీజిల్‌ అమ్మకాలు తగ్గుతుండడం సాధారణంగానే కనిపిస్తుంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 6.7 శాతం, మే నెలలో 9.3 శాతం చొప్పున డీజిల్‌ అమ్మకాలు పెరగడం గమనించొచ్చు.

ఇక ఈ ఏడాది జూన్‌ నెలలోని అమ్మకాలతో పోల్చి చూసినా, జూలైలో డీజిల్‌ విక్రయాలు (7.13 మిలియన్‌ టన్నులు) 13.7 శాతం తగ్గాయి. భారత్‌లో ఆయిల్‌ డిమాండ్‌ రోజువారీగా 0.2 మిలియన్‌ బ్యారెళ్ల చొప్పున 2023లో ఉంటుందని చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య ఓపెక్‌ అంచనాగా ఉంది. ఇక విమాన సేవలకు డిమాండ్‌ గణనీయంగా పెరగడంతో ఏవియేషన్‌ టర్బయిన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌) డిమాండ్‌ సైతం 10 శాతం పెరిగి జూలైలో 6,03,500 టన్నులుగా నమోదైంది.

2021 జూలైలో వినియోగంతో పోలిస్తే రెట్టింపు కాగా, కరోనా ముందు నాటి సంవత్సరం 2019 జూలైలో వినియోగంతో పోల్చి చూస్తే 2.9 శాతం తక్కువగా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. జూలైలో వంటగ్యాస్‌ (ఎల్‌పీజీ) అమ్మకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చచూసినప్పుడు 1.7 శాతం తగ్గి 2.46 మిలియన్‌ టన్నులుగా నమోదైంది. జూన్‌ నెలతో పోల్చి చూస్తే కనుక 8 శాతం ఎల్‌పీజీ అమ్మకాలు పెరిగాయి. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)