Breaking News

పనితీరు బాగుంటే ప్రోత్సాహకాలు

Published on Wed, 11/20/2024 - 21:14

ప్రభుత్వ రంగ బ్యాంకులు సమర్థంగా పని చేసేందుకు వీలుగా కేంద్రం చర్యలు చేపడుతోంది. బ్యాంకులను సారథ్యం వహిస్తున్న సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు, హోల్‌టైమ్‌ డైరెక్టర్ల పనితీరును పరిగణనలోకి తీసుకుని ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘పర్ఫార్మెన్స్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌(పీఎల్‌ఐ)’లో సవరణలు చేస్తున్నట్లు ప్రకటించింది.

పీఎల్‌ఐ అందుకోవాలంటే అర్హతలు

రిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్‌ఓఏ): బ్యాంకులకు పాజిటివ్ ఆర్‌ఓఏ ఉండాలి. మొత్తం బ్యాంకు మిగులుపై మెరుగైన రాబడులుండాలి.

ఎన్‌పీఏ: నికర నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) 1.5 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. ఒకవేళ అంతకంటే ఎక్కువగా ఉంటే ఆర్థిక సంవత్సరంలో కనీసం 25 బేసిస్ పాయింట్లు ఎన్‌పీఏ తగ్గించాలి.

కాస్ట్ టు ఇన్‌కమ్ రేషియో (సీఐఆర్‌): సీఐఆర్‌ 50% లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. వచ్చే ఆదాయం, చేసే ఖర్చుల మధ్య నిష్పత్తిని అది సూచిస్తుంది. ఒకవేళ ఇది 50 శాతం కంటే ఎక్కువగా ఉంటే ఏడాదిలో మెరుగుదల చూపించాలి.

ప్రోత్సాహకాలు.. ఇతర వివరాలు

నిబంధనల ప్రకారం బ్యాంకులు మెరుగ్గా పనితీరు కనబరిస్తే వారి సారథులకు పీఎల్ఐలో భాగంగా ఒకే విడతలో నగదు చెల్లిస్తారు. లేటరల్ నియామకాల్లో వచ్చిన వారు, డిప్యుటేషన్ పై ఉన్న అధికారులు సహా స్కేల్ 4, ఆపై అధికారులు ఈ పథకానికి అర్హులు. ఉద్యోగం నుంచి తొలగించిన వారు దీనికి అనర్హులు.

ఇదీ చదవండి: రూ.25 వేలతో మూడేళ్లలో రూ.33 కోట్ల వ్యాపారం!

2023-24 ఆర్థిక సంవత్సరం పనితీరును పరిగణనలోకి తీసుకుని ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి బ్యాంకు ఆడిట్ చేసిన గణాంకాల ఆధారంగా పనితీరును లెక్కించనున్నారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)