Breaking News

పెప్సికో ఇండియా సీఈఓగా జాగృత్ కొటేచా

Published on Fri, 01/19/2024 - 12:43

ప్రముఖ ఆహార, పానీయాల తయారీ సంస్థ పెప్సికో ఇండియా సీఈఓగా 'జాగృత్ కొటేచా' (Jagrut Kotecha) బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ 'అహ్మద్ ఎల్ షేక్‌'కు కంపెనీ మిడిల్ ఈస్ట్ బ్రాంచ్ బాధ్యతలు అప్పగించిన తర్వాత కొటేచాను సీఈఓగా ఎంపిక చేశారు.

కొటేచా ముంబై యూనివర్సిటీ నుంచి బీఈ, నర్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుంచి మాస్టర్ అఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) పూర్తి చేశారు. చదువు పూర్తయిన తరువాత క్యాడ్‌బరీ ఇండియా సేల్స్‌లో చేరి 1994 వరకు కొనసాగారు. ఆ తరువాత పెప్సికో ఇండియాలో సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో అడుగుపెట్టి 1997లో ప్రాంతీయ సేల్స్ మేనేజర్‌గా, 1999లో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేశారు. ఆ తరువాత థాయ్‌లాండ్‌, ఫిలిప్పీన్స్, మలేసియా, సింగపూర్, బృనియా, మంగోలియా దేశాల్లో కూడా పనిచేశారు. 

జాగృత్ కొటేచా పెప్సికో ఇండియా సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా పెప్సికో ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ & సౌత్ ఏషియా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యూజీన్ విల్లెమ్‌సెన్ మాట్లాడుతూ.. భారతదేశం కంపెనీకు కీలకమైన మార్కెట్ అని, ఇది కొటేచా నేతృత్వంలో మరింత ముందుకు సాగుతుందని తెలిపారు.

ఇదీ చదవండి: యూపీఐ క్యూఆర్ కోడ్‌ స్కాన్ చేస్తున్నారా.. జర భద్రం! 

గత కొంత కాలంగా పెప్సికో కుటుంబంలోనే ఉన్న కొటేచా భారతదేశంలో కంపెనీ వ్యాపారాన్ని మరింత బలపరుస్తారని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. పెప్సికో ఇండియా గత సెప్టెంబర్‌లో రూ. 778 కోట్ల పెట్టుబడితో అస్సాంలోని నల్‌బారిలో తన మొదటి ఆహార తయారీ ప్లాంట్‌ను ప్రకటించింది. ఇది 2025 నాటికి పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)