Breaking News

టాటాకు సంతాపం తెలుపుతూ ట్వీట్‌.. కాసేపటికే డిలిట్‌!

Published on Sat, 10/12/2024 - 10:20

రతన్‌ టాటా మృతిపట్ల సంతాపం తెలుపుతూ పేటీఎం సీఈఓ విజయ్‌శేఖర్‌ శర్మ చేసిన ట్వీట్‌పై తీవ్ర విమర్శలు రావడంతో దాన్ని తొలగించారు. టాటా మరణవార్త విని పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. పేటీఎం సీఈఓ విజయ్‌శేఖర్‌ శర్మ తన ఎక్స్‌ ఖాతా ద్వారా టాటాకు సంతాపం ప్రకటించారు. అయితే తన ట్వీట్‌లోని చివరి లైన్లపై నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవడంతో వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించారు.

‘భవిష్యత్తు తరం వ్యాపారులు టాటా ఇచ్చే సలహాలు, సూచనలను మిస్‌ అవుతారు. ప్రతి తరానికి స్ఫూర్తినిచ్చే లెజెండ్ టాటా. సెల్యూట్‌ సర్‌.. ఓకే టాటా బైబై’ అని విజయ్‌శేఖర్‌ శర్మ తన ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. అంతా బాగానే ఉంది కానీ చివరి లైన్‌ ‘ఓకే టాటా బైబై’పై నెటిజన్లు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో కాసేపటికే శర్మ ఆ పోస్ట్‌ను తొలగించారు.

ఇదీ చదవండి: టోల్‌ఛార్జీ లేకుండా ఫ్రీగా వెళ్లొచ్చు!

రతన్‌ టాటా మరణ వార్త తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్, టీవీఎస్‌ మోటార్స్‌ గౌరవ చైర్మన్‌ వేణు శ్రీనివాసన్, ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌ చైర్మన్‌, సంజీవ్‌ గోయెంకా, ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌, కుమారమంగళం బిర్లా, హిందుజా గ్రూప్‌ చైర్మన్‌. జీపీ హిందుజా, ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (ఇండిగో) ఎండీ రాహుల్‌ భాటియా, హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఎండీ ఉన్సూకిమ్..వంటి ఎందరో ప్రముఖులు నివాళులు అర్పించిన విషయం తెలిసిందే.
 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)