Breaking News

ఆర్‌బీఐ మార్గదర్శకాలు.. పేటిఎం ఆఫ్‌లైన్‌ బిజినెస్ బదిలీ!

Published on Sun, 10/26/2025 - 08:45

న్యూఢిల్లీ: పేమెంట్‌ ఆగ్రిగేటర్లకు రిజర్వ్‌ బ్యాంకు సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆఫ్‌లైన్‌ మర్చెంట్‌ పేమెంట్స్‌ వ్యాపారాన్ని తన అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్‌ సర్వీసెస్(పీపీఎస్‌ఎల్‌)కు బదిలీ చేసేందుకు పేటీఎం మాతృసంస్థ ‘వన్‌97 కమ్యూనికేషన్స్‌’ ఆమోదం తెలిపింది. తద్వారా గ్రూప్‌ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ మర్చెంట్‌ పేమెంట్స్‌ వ్యాపారాలు పీపీఎస్‌ఎల్‌ పరిధిలోకి వస్తాయని పేర్కొంది.

ఆన్‌లైన్‌ పేమెంట్‌ అగ్రిగేటర్‌ వ్యాపార నిర్వహణకు పీపీఎస్‌ఎస్‌ ఇప్పటికే ఆర్‌బీఐ నుంచి ప్రాథమిక అనుమతి పొందినట్లు వివరించింది. పేమెంట్‌ అగ్రిగేషన్‌ కార్యకలాపాలన్నీ ఒకే సంస్థ నియంత్రణలో ఉండటం వల్ల.. సమన్వయ సామర్థ్యాలు మరింత పెరుగుతాయని కంపెనీ చెప్పుకొచ్చింది.

‘‘క్యూఆర్‌ కోడ్‌లు, సౌండ్‌ బాక్సులు, ఈడీసీ మెషిన్‌ పేమెంట్లు ఆఫ్‌లైన్‌ మర్చెంట్‌ పేమెంట్స్‌ వ్యాపారం కింద వస్తాయి. పీపీఎస్‌ఎల్‌ బోర్డు, షేర్‌హోల్డర్ల ఆమోదానికి లోబడి బదిలీ ప్రక్రియ ఉంటుంది. కావున ఆర్థిక ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉండదు’’ అని కంపెనీ వివరణ ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరం 2024 - 25లో ఆఫ్‌లైన్‌ మర్చెంట్‌ పేటమెంట్స్‌ బిజినెస్‌ ఆదాయం రూ.2,850 కోట్లుగా నమోదైంది. కంపెనీ మొత్తం ఆదాయంలో 47% వాటా ఇది.

#

Tags : 1

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)