Breaking News

లాభాలపై రూ. 500 కోట్ల ప్రభావం

Published on Sat, 02/03/2024 - 04:30

న్యూఢిల్లీ: పేటీఎం పేమెట్స్‌ బ్యాంక్‌పై (పీపీబీఎల్‌)పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆంక్షల వల్ల తమ వార్షిక నిర్వహణ లాభాలపై రూ. 300–500 కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడొచ్చని ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎం అంచనా వేసింది. పీపీబీఎల్‌ డిపాజిట్లను స్వీకరించకుండా విధించిన ఆంక్షలతో, కస్టమర్లు తమ వాలెట్లలో డబ్బును డిపాజిట్‌ చేసే అవకాశం లేకపోవడం ఇందుకు కారణమని పేర్కొంది. అయితే, లాభదాయకతను మెరుగుపర్చుకునే దిశగా తమ ప్రయాణం ముందుకు కొనసాగుతుందని వివరించింది.

డిసెంబర్‌లో పీపీబీఎల్‌ ద్వారా 41 కోట్ల యూపీఐ రెమిటెన్సుల లావాదేవీలు జరిగాయి. పేటీఎం బ్రాండ్‌ మాతృసంస్థ అయిన వన్‌97 కమ్యూనికేషన్స్‌కి (ఓసీఎల్‌) పీపీబీఎల్‌లో 49 శాతం వాటాలు ఉన్నాయి. 50 శాతం లోపు మైనారిటీ వాటాలే ఉన్నందున దాన్ని అనుబంధ సంస్థగా కాకుండా అసోసియేట్‌ సంస్థగా పరిగణిస్తోంది. ఒక పేమెంట్స్‌ కంపెనీగా పీపీబీఎల్‌తో పాటు వివిధ బ్యాంకులతో ఓసీఎల్‌ కలిసి పని చేస్తోందని పేటీఎం తెలిపింది.

తాజా పరిణామం కారణంగా ఇకపై పీపీబీఎల్‌తో కాకుండా ఇతర బ్యాంకులతో మాత్రమే ఓసీఎల్‌ పని చేస్తుందని వివరించింది. పదే పదే నిబంధనల ఉల్లంఘనల కారణంగా ఫిబ్రవరి 29 నుంచి కస్టమర్ల ఖాతాలు, ప్రీపెయిడ్‌ సాధనాలు, వాలెట్లు, ఫాస్టాగ్‌లు మొదలైన వాటిల్లో డిపాజిట్లు, టాప్‌అప్‌లను స్వీకరించరాదంటూ పీపీబీఎల్‌పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)