Breaking News

శ్రీరామ్‌ ఫైనాన్స్‌తో పేటీఎం జట్టు

Published on Sat, 07/01/2023 - 04:41

చెన్నై: ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎం తాజాగా శ్రీరామ్‌ ఫైనాన్స్‌తో జట్టు కట్టింది. పేటీఎం నెట్‌వర్క్‌లోని వ్యాపారులు శ్రీరామ్‌ ఫైనాన్స్‌ నుంచి రుణాలు పొందేందుకు ఇది ఉపయోగపడనుంది. తర్వాత దశల్లో వినియోగదారులకు కూడా రుణాలను అందించేలా దీన్ని విస్తరించనున్నట్లు శ్రీరామ్‌ ఫైనాన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ ఉమేష్‌ రేవాంకర్‌ తెలిపారు. దేశీయంగా రిటైల్‌ రుణాలకు భారీగా డిమా ండ్‌ నెలకొందని, రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరగనుందని ఆయన వివరించారు.

రుణాల పంపిణీ వ్యవస్థను మరింతగా విస్తరించేందుకు శ్రీరా మ్‌ ఫైనాన్స్‌తో ఒప్పందం దోహదపడగలదని పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ వ్యవస్థాపకుడు విజయ్‌శేఖర్‌శర్మ పేర్కొన్నారు. తమ ప్లాట్‌ ఫాంపై చిన్న వ్యాపారులు, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు రుణాలతో పాటు ఇతరత్రా డిజిటల్‌ ఆర్థి క సర్వీసులు అందించేందుకు ఇది తోడ్పడగలదని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌శేఖర్‌శర్మ పేర్కొన్నారు. దాదాపు రూ. 1.85 లక్షల కోట్ల అసెట్స్‌ను నిర్వహిస్తూ.. 2,922 శాఖలు, 64,052 మంది ఉద్యోగులతో శ్రీరామ్‌ ఫైనాన్స్‌ దేశీయంగా అతి పెద్ద రిటైల్‌ ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీల్లో ఒకటిగా ఉంది. 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు