పేటీఎంకు పెరిగిన నష్టాలు

Published on Thu, 05/23/2024 - 05:46

న్యూఢిల్లీ: ఫిన్‌టెక్‌ కంపెనీ వన్‌97 కమ్యూనికేషన్స్‌ క్యూ4లో నికర నష్టం భారీగా పెరిగి రూ. 168 కోట్ల నుంచి రూ. 550 కోట్లకు చేరింది. పేటీఎం బ్రాండ్‌ కంపెనీ మొత్తం ఆదాయం 3 శాతం క్షీణించి రూ. 2,267 కోట్లకు పరిమితమైంది. యూపీఐ లావాదేవీలు తదితరాలలో తాత్కాలిక అవరోధాలు, పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌(పీపీబీఎల్‌)కు శాశ్వత అంతరాయం కారణంగా పనితీరు దెబ్బతిన్నట్లు కంపెనీ పేర్కొంది. 

బ్యాంక్‌ భవిష్యత్‌ బిజినెస్‌పై అనిశ్చితి కొనసాగనున్న నేపథ్యంలో పీపీబీఎల్‌లో 39 శాతం వాటాకుగాను క్యూ4లో  రూ. 227 కోట్ల పెట్టుబడులను రద్దు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక మొత్తం ఆదాయం 3 శాతం క్షీణించి రూ. 2,267 కోట్లను తాకినట్లు తెలియజేశారు. 2022–23లో రూ. 2,465 కోట్ల టర్నోవర్‌ సాధించిన విషయాన్ని ప్రస్తావించారు.  ఇక గతేడాది నికర నష్టం రూ. 1,422 కోట్లకు చేరగా.. 2022–23లో రూ. 1,777 కోట్ల నష్టం నమోదైంది.  
ఫలితాల నేపథ్యంలో పేటీఎం షేరు బీఎస్‌ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 369 వద్ద ముగిసింది. 
 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)