Breaking News

వీర్య దానంతో పుట్టినవారికి ఆస్తిలో సమాన వాటా

Published on Fri, 06/20/2025 - 12:14

టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ తన మొత్తం సంపద దాదాపు 17 బిలియన్ డాలర్లను తన 100 మందికి పైగా పిల్లలకు పంచాలనుకుంటున్నట్లు చెప్పారు. అయితే తనకు ఇంకా పెళ్లి కాలేదు.. ఈ పిల్లలందరూ తన వీర్యదానం వల్ల పుట్టిన సంతానం కావడం విశేషం. ఫ్రెంచ్ మ్యాగజైన్ లీ పాయింట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 40 ఏళ్ల దురోవ్ తాను కనీసం 106 మంది పిల్లలకు బయోలాజికల్ ఫాదర్ అని చెప్పారు. వీరిలో ఆరుగురు వేర్వేరు తన భాగస్వాములతో సహజంగా గర్భం దాల్చగా, మిగిలిన 100 మందికి పైగా పిల్లలు 12 దేశాల్లో జన్మించారని చెప్పారు.

‘నా పిల్లల్లో కొందరు సహజంగా గర్భం దాల్చి పుట్టినవారున్నారు. చాలామంది నా స్పెర్మ్ దానం వల్ల పుట్టినవారున్నారు. వారంతా నా బిడ్డలే. అందరికీ నా ఆస్తిలో సమాన హక్కులు ఉంటాయి’ అని చెప్పారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్ ఇండెక్స్, ఫోర్బ్స్ రిపోర్ట్‌ ప్రకారం దురోవ్ నికర విలువ 13.9 బిలియన్ డాలర్ల నుంచి 17.1 బిలియన్ డాలర్ల మధ్య ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఒక్కో బిడ్డకు సుమారు 131 మిలియన్ డాలర్ల నుంచి 161 మిలియన్ డాలర్ల వరకు వారసత్వంగా లభిస్తుంది. అయితే తన పిల్లలకు సమాన హక్కులు ప్రకటించినట్లు ఉన్న ఇంటర్వ్యూ తేదీ(జూన్‌ 19, 2025) నుంచి 30 సంవత్సరాల వరకు తన ఆస్తిపై హక్కు ఉండదని చెప్పారు. ముప్పై ఏళ్ల తర్వాతే తమకు హక్కులుంటాయన్నారు. వారు స్వతంత్రంగా ఎదగడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దురోవ్ వివరించారు. వారు సాధారణ ప్రజల మాదిరిగా జీవించాలని, ఒంటరిగా తమను తాము నిర్మించుకోవాలని తెలిపారు.

ఇదీ చదవండి: బిగ్‌ రిలీఫ్‌! తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..

దురోవ్‌ను ఇటీవల ఫ్రెంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనపై వచ్చిన అనేక ఆరోపణల్లో ప్రధానంగా టెలిగ్రామ్‌ను మనీలాండరింగ్, పిల్లలపై లైంగిక వేధింపులు.. వంటి వాటికి వినియోగిస్తున్నారనే వాదనలున్నాయి. రష్యాలో జన్మించిన పారిశ్రామికవేత్త దురోవ్‌కు ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండింటిలోనూ పౌరసత్వం ఉంది. నిర్దిష్ట అనుమతులు లేకుండా ఫ్రాన్స్ విడిచి వెళ్లడానికి వీల్లేదని నిషేధం విధించారు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)