Breaking News

పాస్‌పోర్ట్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ బంద్‌!

Published on Thu, 08/29/2024 - 11:37

పాస్‌పోర్ట్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ తాత్కాలికంగా మూతపడింది. నిర్వహణ పనుల నిమిత్తం ఐదు రోజుల పాటు పోర్టల్‌ను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఐదు రోజులూ దరఖాస్తుదారులకు పోర్టల్‌ అందుబాటులో ఉండదు. కొత్త అపాయింట్‌మెంట్‌లేవీ కేటాయించరు. అలాగే ముందుగా బుక్ చేసుకున్న అపాయింట్‌మెంట్‌లను సైతం రీషెడ్యూల్ చేస్తారు.

"సాంకేతిక నిర్వహణ పనుల కారణంగా పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ ఆగస్ట్  29 రాత్రి 8 గంటల నుండి సెప్టెంబర్ 2 ఉదయం 6 గంటల వరకు పనిచేయదు. సాధారణ ప్రజలతోపాటు పోలీసులు, ఇతర ఏజెన్సీలకు సైతం ఈ రోజుల్లో పోర్టల్‌ అందుబాటులో ఉండదు. ఆగస్ట్ 30 కోసం ఇప్పటికే బుక్ చేసుకున్న అపాయింట్‌మెంట్‌లను తగిన విధంగా రీషెడ్యూల్ చేసి దరఖాస్తుదారులకు తెలియజేస్తాం" అని పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌లో పేర్కొన్నారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయడానికి లేదా పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరించడానికి దేశవ్యాప్తంగా కేంద్రాలలో అపాయింట్‌మెంట్‌లను బుక్ చేయడానికి పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌ను వినియోగిస్తారు. అపాయింట్‌మెంట్ రోజున, దరఖాస్తుదారులు తప్పనిసరిగా పాస్‌పోర్ట్ కేంద్రాలకు చేరుకుని ధ్రువీకరణ కోసం తమ పత్రాలను అందించాల్సి ఉంటుంది. దీని తరువాత, పోలీస్‌ వెరిఫికేషన్‌ జరుగుతుంది. ఇదంతా పూర్తయ్యాగా పాస్‌పోర్ట్ దరఖాస్తుదారు చిరునామాకు చేరుతుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)