Breaking News

ఎక్కువమంది కొనేస్తున్న వెహికల్స్ ఇవే..

Published on Fri, 02/28/2025 - 11:50

న్యూఢిల్లీ: ప్యాసింజర్‌ వెహికిల్స్‌ (పీవీ) విక్రయాల్లో దేశవ్యాప్తంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో 4 - 7 శాతం వృద్ధి అంచనా వేస్తున్నట్టు రేటింగ్స్‌ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. డిమాండ్‌ను నడిపించే విభాగాలు తటస్థంగా లేదా అనుకూలంగా ఉంటాయని వివరించింది. ‘ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాలు 2023-24లో 42 లక్షల యూనిట్ల ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆటోమొబైల్‌ తయారీదారుల స్థిర ఉత్పత్తి కారణంగా హోల్‌సేల్స్‌ స్థిరంగా ఉన్నాయి. అయితే తగ్గుతున్న రీప్లేస్‌మెంట్‌ డిమాండ్, అధిక ఇన్వెంటరీ స్థాయిల నేపథ్యంలో పరిశ్రమ పరిమాణ వృద్ధి దాదాపు 2 శాతం వద్ద నిరాడంబరంగా ఉంది. ద్విచక్ర వాహనాల విభాగంలో 2024-25లో 11-14 శాతం వృద్ధి నమోదు కావొచ్చు. ఇది వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6–9 శాతం ఉండొచ్చు. మెరుగైన వర్షపాతం కారణంగా కొన్ని నెలలుగా గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమకు మంచి మద్దతు లభిస్తోంది.

రబీ సాగు ఇప్పటివరకు ఆరోగ్యంగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ బాగా పెరుగుతుందని అంచనా. దేశీయ వాణిజ్య వాహన పరిశ్రమ 2025–26లో స్వల్ప వృద్ధి నమోదు చేస్తుంది. ప్రభుత్వ పాత వాహనాలను తప్పనిసరిగా తుక్కుగా చేయడం, రీప్లేస్‌మెంట్‌ డిమాండ్‌ బస్‌ల విక్రయాల్లో వృద్ధిని పెంచుతాయి. ఎలక్ట్రిక్‌ త్రీవీలర్ల జోరు, ఈ–కామర్స్‌లో మందగమనంతో తేలికపాటి వాణిజ్య వాహనాల వృద్ధి తక్కువగా ఉంటుంది. మధ్య, భారీ వాణిజ్య వాహనాలు; తేలికపాటి వాణిజ్య వాహనాలు, బస్‌లు 2025–26లో వరుసగా 0–3 శాతం, 3–5, 8–10 శాతం దూసుకెళ్తాయని అంచనా’ అని ఇక్రా తెలిపింది.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)