Breaking News

ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు 4% అప్‌

Published on Fri, 05/16/2025 - 05:51

న్యూఢిల్లీ: దేశంలో ప్రయాణికుల వాహనాల టోకు అమ్మకాలు ఏప్రిల్‌లో 4% పెరిగి 3,48,847 యూనిట్లకు చేరుకున్నాయని భారత వాహన తయారీదార్ల సంఘం (సియామ్‌) వెల్లడించింది. 2024 ఏప్రిల్‌లో విక్రయాలు 3,35,629 వాహనాలతో పోలిస్తే ఇవి 4% అధికంగా ఉన్నాయి. ద్వి చక్రవాహన విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 17% క్షీణించి 17,51,393 నుంచి 14,58,784 యూనిట్లకు తగ్గాయి. ఇందులో మోటార్‌ సైకిల్‌ సరఫరా 23% తగ్గి 8,71,666 యూనిట్లకు దిగివచ్చాయి. 

స్కూటర్‌ అమ్మకాలు 5,81,277 నుంచి 5,48,370 యూనిట్లకు; మోపెడ్‌ విక్రయాలు 41,924 నుంచి 38,748 యూనిట్లకు తగ్గాయి. త్రిచక్రవాహన విక్రయాలు సైతం స్వల్పంగా 0.75% తగ్గి 49,441 యూనిట్లకు దిగివచ్చాయి. ‘‘ ప్యాసింజర్‌ వాహన విభాగం ఏప్రిల్‌ 2025లో ఇప్పటివరకు అత్యధికంగా 3.49 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది ఏప్రిల్‌ 2024తో పోలిస్తే 3.9 శాతం ఎక్కువ. అధిక బేస్‌ ప్రభావం అమ్మకాలపై పడటంతో ద్విచక్రవాహన విభాగం రెండంకెల క్షీణతను చవిచూసింది. రానున్న నెలల్లో తిరిగి పుంజుకునే వీలుంది’’ అని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ మీనన్‌ తెలిపారు.  
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)