Breaking News

పీనోట్ల పెట్టుబడుల దూకుడు

Published on Thu, 06/01/2023 - 06:23

న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్‌ మార్కెట్లలో పార్టిసిపేటరీ(పీ) నోట్ల పెట్టుబడులు గత నెల(ఏప్రిల్‌)లో రూ. 95,911 కోట్లను తాకాయి. ఇది నాలుగు నెలల గరిష్టంకాగా.. గత రెండు నెలలుగా పీనోట్ల పెట్టుబడులు పెరుగుతూ వస్తున్నాయి. ఇంతక్రితం 2022 నవంబర్‌లో పీనోట్‌ పెట్టుబడులు రూ. 96,292 కోట్లకు చేరాయి. ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుండటం తాజా పెట్టుబడులకు కారణమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దేశీయంగా రిజిస్టరైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(పీఎఫ్‌ఐలు) వీటిని జారీ చేస్తుంటారు. ప్రత్యక్షంగా రిజిస్టర్‌కాకుండానే దేశీ స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తి చూపే విదేశీ ఇన్వెస్టర్లకు వీటిని ఎఫ్‌పీఐలు జారీ చేసే సంగతి తెలిసిందే.

అయితే ఇందుకు తగిన పరిశీలన చేపట్టాక మాత్రమే వీటిని జారీ చేస్తారు. క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం దేశీయంగా ఈక్విటీ, రుణ, హైబ్రిడ్‌ సెక్యూరిటీలలో పీనోట్‌ పెట్టుబడుల విలువ ఏప్రిల్‌ చివరికల్లా రూ. 95,911 కోట్లను తాకింది. మార్చి నెలాఖరుకు ఈ విలువ రూ. 88,600 కోట్లుగా నమోదైంది. ఇక ఫిబ్రవరికల్లా ఇవి రూ. 88,398 కోట్లుకాగా.. జనవరి చివరిలో రూ. 91,469 కోట్లకు చేరాయి. వెరసి మార్చిలో స్వల్పంగా పుంజుకోగా.. ఏప్రిల్‌లో భారీ వృద్ధి నమోదైంది. తాజాగా నమోదైన పెట్టుబడుల్లో రూ. 86,226 కోట్లు ఈక్విటీలలోకి ప్రవేశించాయి. ఈ బాటలో రూ. 9,586 కోట్లను రుణ పత్రాలలో ఇన్వెస్ట్‌ చేయగా, మరో రూ. 100 కోట్లు హైబ్రిడ్‌ సెక్యూరిటీల కొనుగోలుకి విదేశీ ఇన్వెస్టర్లు వెచ్చించారు. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు