Breaking News

రూ.58 వేలకోట్లు!.. విజయ్ మాల్యాతో సహా 15 మంది అప్పు

Published on Tue, 12/02/2025 - 16:28

ప్రముఖ వ్యాపారవేత్తలుగా వెలుగొంది.. అప్పులపాలై దేశాన్ని విడిచిపెట్టిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి 15మంది ఆర్ధిక నేరస్థులు బ్యాంకులకు రూ. 58,082 కోట్ల బకాయిలు చెల్లించాలి. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు.

లోక్‌సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు, పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. మొత్తం 15మంది ఆర్ధిక నేరస్థులలో.. 9 మంది పెద్ద మొత్తంలో ఆర్ధిక మోసాలకు పాల్పడ్డారని, ఇద్దరు మాత్రమే పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్నారని అన్నారు. 15మంది బ్యాంకులకు చెల్లించాల్సిన అసలు రూ.26,645 కోట్లు. వడ్డీ మొత్తం రూ. 31,437 కోట్లు. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ. 58,082 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు.

పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల చట్టం, 2018 (FEOA) నిబంధనల ప్రకారం.. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ సహా మొత్తం 15మంది నుంచి ఇప్పటివరకు 33 శాతం (రూ. 19187 కోట్లు) రికవరీ చేసినట్లు పంకజ్ చౌదరి పేర్కొన్నారు. ఇంకా వెనక్కి రావాల్సిన మొత్తం రూ. 38,895 కోట్లు అని అన్నారు.

అత్యధికంగా విజయ్ మాల్యా
విజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఎక్కువ అప్పు తీసుకున్నట్లు సమాచారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం రూ.6,848.28 కోట్లు అప్పు తీసుకోగా.. అది వడ్డీతో కలిపి రూ.11,960.05 కోట్లకు పెరిగింది. అలాగే విజయ్ మాల్యాకు సంబంధించిన అప్పులపై ఇతర బ్యాంకులు సైతం ప్రకటనలు చేశాయి. నీరవ్ మోదీ ఫైర్ స్టార్, డైమండ్ గ్రూప్ కంపెనీల ద్వారా మొత్తం రూ.7800 కోట్ల అప్పు తీసుకున్నారు. పీఎన్‌బీ వద్దే ఒకే మొత్తంలో రూ.6799.18 కోట్లు అప్పు తీసుకున్నారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)