Breaking News

పానాసోనిక్ 4680 బ్యాటరీ: ఎక్కువ రేంజ్ కోసం..

Published on Thu, 10/03/2024 - 13:08

జపాన్‌కు చెందిన పానాసోనిక్ కంపెనీ 4680 లిథియం అయాన్ బ్యాటరీ సెల్‌లను భారీగా ఉత్పత్తి చేయడానికి సన్నద్ధమైంది. ఎలక్ట్రిక్ వాహనాల పరిధిని (రేంజ్) పెంచడానికి ఈ కంపెనీ వీటిని తయారు చేయడానికి పూనుకుంది. ఈ బ్యాటరీల వినియోగంతో ఖర్చు కూడా తగ్గుతుందని తెలుస్తుంది.

సాధారణంగా ఇప్పటి వరకు చాలా ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించిన 2170 సెల్స్  21 మిమీ వ్యాసం, 70 మిమీ పొడవు (0.83 x 2.8 ఇంచెస్) ఉంటుంది. అయితే 4680 సెల్స్ మాత్రం 46 x 80 మిమీ (1.8 x 3.1 ఇంచెస్) వద్ద చాలా లావుగా, కొంచెం పొడవుగా ఉంటాయి. అంతే వీటి పనితీరు కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.

4680 సెల్స్ పరిమాణంలో లావుగా ఉండటం వల్ల.. చిన్న సెల్స్ కంటే కూడా ఐదు రెట్లు ఎక్కువ పవర్ డెలివరీ చేస్తాయి. వీటిని ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించినప్పుడు రేంజ్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వినియోగదారుడు పీక్ పవర్ ఆశించవచ్చు. ఛార్జింగ్ కూడా చాలా వేగంగా ఉంటుంది. టెస్లా 2020 బ్యాటరీ డేలో ప్రకటించిన సెల్ కూడా ఇదే పరిమాణంలో ఉంది.

ఇదీ చదవండి: పసిడి పరుగు.. భారీగా పెరిగిన బంగారం ధరలు 

పానాసోనిక్ కంపెనీ 4680 బ్యాటరీల ఉత్పత్తిని త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి 400 మంది సిబ్బంది దీనికోసం పనిచేయనున్నట్లు సమాచారం. సంస్థ ఈ సెల్స్ ఉత్పత్తి చేసి టెస్లా, లూసిడ్, టయోటా, ఫోర్డ్‌ వంటి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)