Breaking News

ఓయో లాభం రెట్టింపు

Published on Sat, 09/06/2025 - 05:42

న్యూఢిల్లీ: ట్రావెల్‌ టెక్‌ ప్లాట్‌ఫామ్‌ ఓయో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 200 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 87 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 47 శాతం జంప్‌చేసి రూ. 2,019 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 1,371 కోట్ల టర్నోవర్‌ అందుకుంది.

 హోటళ్ల ఇన్వెంటరీని ప్రీమియమైజ్‌(మెరుగైన ధరలు) చేయడంతోపాటు.. గదుల వినియోగం పుంజుకోవడం ఇందుకు సహకరించినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు రితేష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ఈ కాలంలో స్థూల బుకింగ్‌ విలువ(జీబీవీ) రూ. 7,227 కోట్లను తాకింది. గత క్యూ1లో నమోదైన రూ. 2,966 కోట్ల జీబీవీతో పోలిస్తే 144 శాతం దూసుకెళ్లింది. కాగా.. వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లను జారీ చేయనున్నట్లు ఓయో వెల్లడించింది. తద్వారా అదీకృత వాటా మూలధనం రెట్టింపుకానుంది. దీంతోపాటు ఇసాప్‌లో భాగంగా 8.8 కోట్ల స్టాక్‌ అప్షన్స్‌కు తెరతీయనుంది. కంపెనీ త్వరలో పబ్లిక్‌ ఇష్యూకి రానున్న సంగతి తెలిసిందే.     
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)